జన్మదినం రోజు శతమానం భవతి అని దీవించే రోజులు పోయాయి..ఇప్పుడు బర్త్ డే అంటే చితకొట్టుడే అనే కొత్త ట్రెండ్ మొదలైంది. దీన్ని మొదలు పెట్టింది కూడా మన హైదరాబాదీ బీటెక్ బాబులే... కావాలంటే ఈ వీడియో చూడండి. బర్త్ డే జరపుకుంటున్న ఫ్రెండ్ ను ఎలా కొట్టారో..
బర్త్ డే అంటే ఎవరైనా కేక్ కట్ చేస్తారు... ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్ లతో విష్ చేస్తారు. కానీ, హైదరాబాదీ బీటెక్ బాబులకు అలా చేసి బోర్ కొట్టినట్లు ఉంది.
బర్త్ డే బాయ్ తో కేక్ కట్ చేయించాల్సింది పోయి అతడి వీపు విమానం మోత మోగించే నయా కల్చర్ ను స్టార్ట్ చేశారు.
మిడ్ నైట్ 12 కాగానే రోటీన్ గా కేక్ కట్ చేయించి దెబ్బలతో బర్త్ డే బాయ్ కి ఇలా ట్రీట్ ఇస్తున్నారు.
నగర శివార్లలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రస్తతుం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
