హైదరాబాద్‌లో (Hyderabad) దారుణం చోటుచేసుకుంది. మాదాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో (HiTec City railway station) అర్ధనగ్న స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. 

హైదరాబాద్‌లో (Hyderabad) దారుణం చోటుచేసుకుంది. మాదాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో (HiTec City railway station) అర్ధనగ్న స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలు ఎవరని గుర్తించడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. బాధితురాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉండే బిక్షాటన చేసే మహిళ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

వివారాలు.. హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌ సమీపంలోని శిథిలావస్థలో ఉన్న పోలీస్‌ అవుట్‌పోస్టులో సోమవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం అర్ధనగ్న స్థితిలో కనిపించింది. ఇది గమనించిన స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధిత మహిళ తలపై గాయాలు, చెవుల నుంచి రక్తం కారుతున్నట్లు గుర్తించారు. తల గోడకు తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. ‌మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

మహిళను హత్య చేసి మృతదేహాన్ని ఘటనా స్థలంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ వస్తే.. లైంగిక వేధింపులు జరిగాయా అనేది తేలుతుందని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ పి రవీంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ హత్యకు గల ఆధారాల కోసం పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని (CCTV cameras) పరిశీలిస్తున్నారు.

పాల ప్యాకెట్ కోసం వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారం..
మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై gang rapeకి పాల్పడ్డారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్ స్పెక్టర్ సైదులు తెలిపారు. బోరబండ ప్రాంతంలోని ఓ బస్తీకి చెందిన minor girl (17) ఇది చెత్త ఏరుకునే జీవించి పేద కుటుంబం. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో milk packet తీసుకు వచ్చేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్ళింది. 

ఈ సమయంలో అదే బస్తీకి చెందిన శివ (22) బాలికకు ఏవో మాయమాటలు చెప్పి.. సమీపంలోని మరో బస్తీలో ఉండే కార్మికుడిగా పనిచేస్తున్న మిత్రుడు స్థాయి (20) గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఉదయం నాలుగు గంటలకు వారినుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్ళి తల్లికి విషయం చెప్పింది. ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారిపై పోక్సో, అత్యాచారం, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.