Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రణాళికలను స్వాగతించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. కానీ..

Hyderabad: దసరా సందర్భంగా (అక్టోబరు 5న) సీఎం కేసీఆర్ తన కొత్త జాతీయ పార్టీ ఏర్పాటును అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయ‌ని స‌మాచారం. 
 

Hyderabad : BJP MP Laxman welcomed KCR's national party plans.. But..
Author
First Published Oct 1, 2022, 11:16 AM IST

BJP MP Dr K. Laxman: ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) తన జాతీయ పార్టీని తీసుకురావ‌డానికి చేస్తున్న ప్రణాళికలను స్వాగతిస్తున్నట్లు భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు డాక్ట‌ర్ కే. లక్ష్మణ్  చెప్పారు. అయితే, తెలంగాణలో క్లీన్ స్వీప్ చేయడమే తమ పార్టీ లక్ష్యమని ఆయ‌న అన్నారు. దానికి అనుగుణంగా తాము ముందుకు సాగుతున్నామ‌ని ఆయ‌న చెప్పారు. అలాగే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు అంశాన్ని లేవనెత్తిన లక్ష్మణ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఈ అంశంపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పొత్తులపై వ్యాఖ్యానించిన ఆయన, తమకు టీడీపీతో ఎలాంటి రాజకీయ పొత్తు ఉండదనీ, నటుడిగా మారిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో పొత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడంపై వ్యాఖ్యానించిన ఆయన, తాము ఇంకా బీజేపీలో చేరాల్సి ఉందని ఎమ్మెల్యేలు చెబుతున్నారనీ, తెలంగాణలో ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేల చేరిక కొనసాగుతుందని అన్నారు. పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా తన ఎదుగుదల గురించి మాట్లాడిన లక్ష్మణ్, సభ్యుని పదవిని కేంద్ర మంత్రికి సమానమైన పదవిగా పరిగణిస్తాననీ, ఎం. వెంకయ్య నాయుడు తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుని పదవికి నియమించబడిన రెండవ తెలుగు నాయకుడు తానేనని అన్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన లక్ష్మణ్, ఏపీలో ప్ర‌జా ప్ర‌భుత్వ పాల‌న కొన‌సాగడం లేద‌ని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రజలు తమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని చూడాలని కోరుకుంటున్నార‌ని తెలిపారు. 

ఇదిలావుండ‌గా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నార‌ని స‌మాచారం. దసరా నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)ని జాతీయ పార్టీగా మార్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈ ప్రణాళికను తొలిసారిగా బహిరంగపరిచారు. అంతే కాకుండా దేశవ్యాప్తంగా తన పార్టీని ప్రమోట్ చేసేందుకు, వివిధ రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పార్టీల నేతలను కలవడానికి.. చార్టర్డ్ ఫ్లైట్ కొనాలని సీఎం నిర్ణయించుకున్నారు. అక్టోబరు 5న కేసీఆర్ తన కొత్త జాతీయ పార్టీ ఏర్పాటును అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.దేశ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ 5 మధ్యాహ్నం 1:19 గంటలకు ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఆయన ఇతర జాతీయ పార్టీల నేతలను కూడా ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం. 

పార్టీ పేరు, జెండా, ఎజెండా కూడా ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలిసింది. పార్టీ జెండా రంగు 'పింక్'లో ఉంటుందని, దానిపై భారత మ్యాప్ ఉంటుందని వర్గాల సమాచారం. జాతీయ పార్టీని ప్రారంభించిన తర్వాత, పార్టీ కొత్త జెట్ ద్వారా దేశం మొత్తాన్ని సందర్శించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. 12 సీట్ల కెపాసిటీ ఉన్న చార్టర్డ్ ఫ్లైట్ కోసం దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేసేందుకు పార్టీ సిద్ధమైంది. పార్టీ ఖజానాలో రూ.865 కోట్లకు పైగా నిధులు ఉన్నప్పటికీ పార్టీ నేతల నుంచి విరాళాలు స్వీకరించి చార్టర్డ్ విమానానికి అయ్యే ఖర్చును సమకూర్చాలని టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios