రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత : హైదరాబాద్ సంస్థ చేతికి టెండర్.. రేపటి నుంచి పనులు

సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేటలోని డెక్కన్ మాల్‌ను రేపటి నుంచి కూల్చివేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థకు రూ.33 లక్షలకు టెండర్ ఓకే అయ్యింది. భవనం కూల్చివేతకు  ఆధునాతన యంత్రాలు వాడాలని , ఆ సమయంలో  చుట్టుపక్కల వారికి  ప్రమాదం జరగకుండా  చూడాలని అధికారులు కోరారు.  

hyderabad based company gets Bid For The Demolition Of The Deccan Store in ram gopal pet

సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేటలోని డెక్కన్ మాల్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భవనం కూల్చివేతకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ సందర్భంగా 33 లక్షలకు హైదరాబాద్‌కు చెందిన కంపెనీ టెండర్లు దక్కించుకుంది. దీంతో రేపటి నుంచి పనులు మొదలెట్టనుంది కాంట్రాక్ట్ సంస్థ. 

కాగా.. ఈ నెల  19వ తేదీన  రాంగోపాల్ పేట  డెక్కన్ మాల్ లో  అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా భవనంలో  ఆరు అంతస్థులు  పూర్తిగా దెబ్బతిన్నాయి.  సుమారు  11 గంటల పాటు  కష్టపడి  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ భవనంలో  ఉన్న సింథటిక్ , టైర్లు ఇతర మెటీరియల్  మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి కారణంగా మారిందనే   అగ్నిమాపక సిబ్బంది  అభిప్రాయపడ్డారు. ఈ భవనం నుండి నలుగురిని  అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అయితే  ఈ భవనంలో విధులకు వెళ్లిన  వారిలో  ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. ఇదే సమయంలో భవనంలోని సెల్లార్ లో  ఒక అస్థిపంజరం  లభ్యమైంది. ఈ ఆస్థి పంజరం నమూనాలను  ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. 

ALso REad: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత: టెండర్లు ఆహ్వానించిన జీహెచ్ఎంసీ

అగ్ని ప్రమాదం కారణంగా ఈ భవనం పూర్తిగా బలహీనపడింది. దీంతో  ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకన్నారు. భవనం కూల్చివేత  విషయంలో  పక్కనే ఉన్న ఇతర భవనాలకు  నష్టం వాటిల్లకుండా  ఉండాలని అధికారులు  సూచిస్తున్నారు. 1890 చదరపు అడుగుల్లో డెక్కన్  స్పోర్ట్స్ వేర్ భవనం నిర్మించారు. ఈ భవనం కూల్చివేతకు  రూ.33.86 లక్షలతో టెండర్లను ఆహ్వానించారు జీహెచ్ఎంసీ అధికారులు. అంతేకాకుండా భవనం కూల్చివేతకు  ఆధునాతన యంత్రాలు వాడాలని , ఆ సమయంలో చుట్టుపక్కల వారికి  ప్రమాదం జరగకుండా  చూడాలని అధికారులు కోరారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios