హైదరాబాద్ వనస్థలిపురంలోని బ్యాంక్ ఆఫ్‌ బరోడా‌ చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసకుంది. బ్యాంకు నుంచి డబ్బులు దొంగిలించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాషియర్ ప్రవీణ్ ఈరోజు కోర్టులో లొంగిపోయాడు. 

హైదరాబాద్ వనస్థలిపురంలోని బ్యాంక్ ఆఫ్‌ బరోడా‌ చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసకుంది. బ్యాంకు నుంచి డబ్బులు దొంగిలించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాషియర్ ప్రవీణ్ ఈరోజు కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ప్రవీణ్ ఇన్‌స్టాగ్రామ్ చాట్ ఆధారంగా అతడు గోవాలో ఉన్నట్టుగా గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. అయితే ఈలోపే అతడు పోలీసులకు దొరకకుండా కోర్టులో లొంగిపోయాడు. దీంతో కోర్టు అతడికి ఈ నెల 30 వరకు రిమాండ్ విధించింది. 

అయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో చాలా అవకతవకలు ఉన్నాయని క్యాషియర్ ప్రవీణ్ ఆరోపించాడు. తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని చెప్పాడు. బ్యాంకులో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకునేందుకే తనను దోషిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించాడు. అతి త్వరలో బ్యాంక్ మోసాలను బయట పెడతానని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ స్థాయిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కుంభకోణాలు జరుగుతున్నాయని అన్నాడు. త్వరలోనే పూర్తి ఆధారాలతో నిరూపిస్తానని చెప్పాడు. బ్యాంకు లాకర్లకు పెట్టాల్సిన సీసీ కెమెరాను ఎందుకు కిందకు పెట్టారని ప్రశ్నించారు. 

ఇక, హైదరాబాద్ బ్యాంక్ ఆఫ్‌ బరోడా వనస్థలిపురం బ్రాంచ్‌లో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీన యధావిధిగా విదులకు హాజరయ్యాడు. సాయంత్రం నాలుగు గంటలకు తనకు కడుపులో నొప్పిగా ఉందని బ్యాంకు మేనేజర్ కు చెప్పాడు. మెడికల్ షాపులో టాబ్లెట్ తీసుకుని వస్తానని చెప్పి ప్రవీణ్ కుమార్ బ్యాంకు నుండి వెళ్లిపోయాడు. బ్యాంకు ముగిసే సమయమైనా కూడా ప్రవీణ్ కుమార్ బ్యాంకుకు రాలేదు. దీంతో అతనికి బ్యాంకు సిబ్బంది ఫోన్ చేశారు. అయితే ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. అనుమానం వచ్చి ప్రవీణ్ కుమార్ క్యాబిన్ చెక్ చేస్తే రూ. 22 లక్షలు మాయమైనట్టుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. 

Also Read: వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం .. క్యాషియర్‌పై సస్పెన్షన్ వేటు

దీనిపై వెంటనే బ్యాంకు మేనేజర్ Policeలకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రవీణ్ కుమార్ బ్యాంకు మేనేజర్ కు మేసేజ్ పెట్టాడు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు వస్తే తాను తిరిగి బ్యాంకు కు వస్తానని లేకపోతే ఆత్మహత్య చేసుకొంటానని ఆ మేసేజ్ లో తెలిపాడు. ఈ మేసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ ఉపయోగించిన సెల్ పోన్ ఆధారంగా అతను ఎక్కడ ఉన్నాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాలుగు పోలీసు బృందాలు ప్రవీణ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. 

అయితే ఆ తర్వాత కొద్ది గంటకు ప్రవీణ్ మాట మార్చాడు. బ్యాంక్ నుంచి డబ్బులు తాను తీసుకెళ్లలేదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. బ్యాంక్ లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును తనపై మోపుతున్నారని ఆరోపించాడు. గతంలోనూ పలుమార్లు షార్టెజ్ వచ్చిందని.. మేనేజర్‌ను నిలదీసినా పట్టించుకోలేదని ప్రవీణ్ చెబుతున్నాడు. అయితే బ్యాంక్ మేనేజర్ వినయ్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోందని ఆరోపించాడు. అనవసరంగా తనను నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా బ్యాంక్‌లో సరైన నిఘా కూడా లేదని క్యాషియర్ ప్రవీణ్ ఆరోపించాడు.