హైద్రాబాద్ లో ట్రాఫిక్ ఎస్ఐ రమణ సూసైడ్

బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ రమణ  గురువారంనాడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు  కింద  పడి  ఆయన సూసైడ్  చేసుకున్నాడు.

Hyderabad  Banjara hillsTraffic  SI Ramana Commits Suicide


హైదరాబాద్::బంజారాహిల్స్  ట్రాఫిక్ ఎస్ఐ రమణ  గురువారంనాడు  ఆత్మహత్య చేసుకున్నాడు.మౌలాలిలో  రైలు కింద పడి రమణ సూసైడ్ చేసుకున్నారు. రమణ  ఆత్మహత్య చేసుకోవడానికి  గల కారణాలపై పోలీసులు ఆరా  తీస్తున్నారని  ప్రముఖ  తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం  ప్రసారం చేసింది. మౌలాలి  రైల్వేస్టేషన్ పరిధిలో   రమణ రైలు కింద పడి  సూసైడ్  చేసుకున్నారు. దీంతో రమణ శరీరం రెండు భాగాలు విడిపోయింది. 

రెండు  తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజూ ఆత్మహత్యల  కేసులు నమోదౌతున్నట్టుగా పోలీస్ రికార్డులు  చెబుతున్నాయి. మల్లారెడ్డి ఇంజనీరింగ్  కాలేజీలో  ఇంజనీరింగ్ థర్డ్  ఇయర్ చదివే  విద్యార్ధిని శ్రావణి ఈ  నెల  26న సూసైడ్  చేసుకుంది. హస్టల్ గదిలో  శ్రావణి ఆత్మహత్య చేసుకుంది..ఆర్ధిక ఇబ్బందులు,  కుటుంబ కలహల నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.విశాఖపట్టణంలో ఇటీవలనే భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే  భార్య పోలీస్ స్టేషన్ ముందే  పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య  చేసుకుంది. ఈ నెల 20వ  ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకున్న నాలుగు మాసాల తర్వాత వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

also read:హైద్రాబాద్ లో ఇంజనీరింగ్ థర్ఢ్ ఇయర్ విద్యార్ధిని సూసైడ్

ఈ నెల 19న విశాఖపట్టణంలోని లాడ్జీలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ  జంట  లాడ్జీలో కిటీకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.హైద్రాబాద్ చందానగర్ లో ఒకే కుటుంబానికి  చెందిన  నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.ఈ నెల 17న  ఈ ఘటన చోటు చేసుకుంది.మరోవైపు లోన్ యాప్  సంస్థల వేధింపులు భరించలేక  పలువురు ఆత్మహత్యలకు  పాల్పడిన  ఘటనలు కూడ  రెండు తెలుగు రాష్ట్రాల్లో  నమోదయ్యాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios