ఎమ్మెల్యేలకు బెదిరింపు ఫోన్లు:హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసుల కేసు నమోదు
బెదిరింపు ఫోన్ కాల్స్ పై ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.తమకు బెదిరింపులు వస్తున్నట్టుగా హర్షవర్ధన్ రెడ్డి,రోహిత్ రెడ్డిలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్:బెదిరింపు ఫోన్ కాల్స్ పై ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం నాడు కేసు నమోదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 26న మొయినాబాద్ ఫాం హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లు ప్రలోభాలకు గురి చేశారని కేసు నమోదైంది.ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు రాత్రి పోలీసులు మగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.అచ్చంపేట, కొల్లాపుూర్,పినపాక,తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు,బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలను ఈ ముగ్గురు నిందితులు ప్రలోభాలు పెట్టేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో నిందితులను పట్టించడంలో కీలకంగా వ్యవహరించిన నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రతను పెంచింది.2+2 గా ఉన్న సెక్యూరిటీని 4+4గా పెంచారు. నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెల్ ప్రూఫ్ వాహనాలతో పాటు,ఎస్కార్ట్ ను కేటాయించింది ప్రభుత్వం. అంతేకాదు ఎమ్మెల్యేల ఇంటి వద్ద భద్రతను పెంచారు.
also read:ఎమ్మెల్యేలకు బెదిరింపు ఫోన్ కాల్స్: హర్షవర్ధన్ రెడ్డి,రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు
తమ అంతు చూస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లలో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యేలుపోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గుజరాత్ ,యూపీ రాష్ట్రాలకు చెందిన ఫోన్ నెంబర్లతో మాట్లాడారని ఎమ్మెల్యేలు ఫిర్యాదులో పేర్కొన్నారు. 11నెంబర్ల నుండి ఫోన్లు వచ్చినట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఎమ్మెల్యేలు. గత నెల 26వ తేదీన మొయినాబాద్ ఫాంహౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రామచంద్రభారతి, సింహయాజీ,నందకుమార్ లు ప్రలోభపెట్టేందుకుప్రయత్నించారు.ధీని వెనుక బీజేపీ ఉందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసు విచారణను సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ కోరుతుంది. ఈ కేసు విచారణపై ఉన్న స్టేను కొనసాగించడంతోపాటు సిట్ దర్యాప్తును నిలిపివేయాలని బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.