రేవంత్‌పై ఆరోపణలు:కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌పై కేసు నమోదు

తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డిపై  ఆరోపణలు చేసిన  మాజీ మంత్రి కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Hyderabad Banjara Hills police files case against Former Minister KTR lns


హైదరాబాద్: బిల్డర్లను బెదిరించి పార్లమెంట్ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి  రూ. 2500 కోట్లను వసూలు చేసి  కాంగ్రెస్ పెద్దలకు పంపారని  భారత రాష్ట్ర సమితి  నేత, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆరోపణలు చేశారు. మూడు రోజుల క్రితం  బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో  కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

హైద్రాబాద్ లో  మూడు మాసాలుగా  భవన నిర్మాణాలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.  డబ్బులిస్తేనే అనుమతిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రూ. 2500 కోట్లను  వసూలు చేసి  ఢిల్లీకి కప్పం కట్టారని రేవంత్ రెడ్డిపై  కేటీఆర్  సంచలన ఆరోపణలు చేశారు.సమస్యలను పక్కదారి పట్టించేందుకుగాను  ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కాం అంటూ  రేవంత్ రెడ్డి  సర్కార్ టాపిక్ డైవర్ట్ చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు.

ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నేత  బత్తిన శ్రీనివాసరావు  హన్మకొండ పోలీస్ స్టేషన్ లో  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదుపై  పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.  కేటీఆర్ పై  ఐపీసీ ఐపీసీ 504, 502 (2) సెక్షన్ల కింద  కేసు నమోదు చేశారు పోలీసులు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios