Asianet News TeluguAsianet News Telugu

నేడు నిర్మల్ నుండి ప్రారంభంకానున్న బండి సంజ‌య్ 'ప్రజా సంగ్రామ యాత్ర'

Hyderabad: ఐదు జిల్లాలు, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా బీజేపీ ప్ర‌జా సంగ్రామ‌ యాత్ర ఐదో దశ ముందుకు సాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. యాత్ర సమయంలో టీఆర్ఎస్ కార్యక్రమాలు ప్రజల్లో మరింత ట్రాక్షన్ పొందుతాయని బీజేపీ భావిస్తోంది.

Hyderabad : Bandi Sanjay 'Praja Sangrama Yatra' to start from Nirmal today
Author
First Published Nov 28, 2022, 5:59 AM IST

Hyderabad: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ప్రజా సంగ్రామ యాత్ర సోమ‌వారం నిర్మల్ నుంచి ప్రారంభంకానుంది. ప‌లు ముఖ్య‌మైన ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ఐదో ద‌శ ప్ర‌జా సంగ్రామ యాత్ర కొన‌సాగుతుంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. వివరాల్లోకెళ్తే.. దళిత బంధు, చేనేత బంధు, గిరిజన బంధు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ వంటి పతాక కార్యక్రమాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ ఐదో దశ 'ప్రజా సంగ్రామ యాత్ర' చేపట్టారు.

ఐదు జిల్లాలు, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా బీజేపీ ప్ర‌జా సంగ్రామ‌ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. యాత్ర సమయంలో టిఆర్ఎస్ కార్యక్రమాలు ప్రజల్లో మరింత ట్రాక్షన్ పొందుతాయని బీజేపీ భావిస్తోంది. ప్ర‌జా సంగ్రామ యాత్ర కన్వీనర్ డాక్టర్ జీ మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) ఉప ఎన్నికల సమయంలోనే పథకాలను ప్రకటించారనీ, రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు విశ్రమించేది లేదని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వంపై త‌గిన విధంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేలా ఒత్తిడి తీసుకువ‌స్తుంద‌ని బీజేపీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

బీజేపీ ప్ర‌జా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్వహించే బహిరంగ సభలు ప్రజలతో మమేకమై సమస్యలను ఎత్తిచూపడమే కాకుండా పథకాల అమలుపై తమ అభిప్రాయాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తాయన్నారు. నిర్మల్‌లోని అడెల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాత్రను ప్రారంభించాలని నిర్ణయించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. నవంబర్ 28న జరిగే బహిరంగ సభలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రసంగించనున్నారు. ఐదో ద‌శ ప్ర‌జా సంగ్రామ యాత్ర భైంసా నుంచి ప్రారంభమవుతుంది. ఇది మొదటి రోజు 6.3 కిలో మీట‌ర్ల‌ను కవర్ చేస్తుంది. రాత్రి హాల్ట్ కోసం గుండా గావ్ చేరుకుంటుంది. అయితే, నిర్మల్ పోలీసులు భైంసా నుండి యాత్రకు అనుమతి నిరాకరించారు. ఇది సున్నితమైన ప్రాంతం.. భద్రతా కారణాల దృష్ట్యా ప్ర‌జా సంగ్రామ యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. యాత్ర చేయడానికి లేదా బహిరంగ సభ నిర్వహించడానికి కూడా బీజేపీకి అనుమ‌తిని పోలీసులు నిరాక‌రించారు.

దీంతో నిర్మల్ ఎస్పీ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర పార్టీ నాయకులు సీనియర్ అధికారులను కలిశారు. ప్ర‌జా సంగ్రామ యాత్ర కొద్ది దూరం గుండా వెళుతుందని చెప్పారు. అవసరమైతే వారు మార్గాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నార‌ని కూడా చెప్పిన‌ట్టు స‌మాచారుం. ఇంతలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్  భైంసా వెళ్తుండగా జగిత్యాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏది అడ్డువ‌చ్చినా ప్ర‌జా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తామని బీజేజీ నేతలు తెలిపారు. అనుమతి కోసం తాను సోమవారం మధ్యాహ్నం వరకు వేచి ఉంటానని బండి సంజయ్ చెప్పారు. అప్పటికీ పోలీసులు నిరాకరిస్తే ఏం చేయాలో నిర్ణయిస్తామ‌ని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios