"Hyderabad airport సామర్థ్యాన్ని  34 మిలియన్ల మంది ప్రయాణీకులకు పెంచడానికి రూ .6,300 కోట్లు  investments హైదరాబాద్ విమానాశ్రయానికి రాబోతున్నాయి’’అని క్రోంబెజ్ చెప్పారు. 

హైదరాబాద్ : హైదరాబాద్ విమానాశ్రయం సామర్థ్యం త్వరలో 34 మిలియన్ల ప్రయాణీకులకు పెరగబోతోంది. దీనికిగాను రూ .6,300కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఇండో-ఫ్రెంచ్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్క్లేవ్ 2021లో జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ డిప్యూటీ సిఇఒ ఆంటోయిన్ క్రోంబెజ్ ప్రకటించారు.

ఆయన మాట్లాడుతూ.. "Hyderabad airport సామర్థ్యాన్ని 34 మిలియన్ల మంది ప్రయాణీకులకు పెంచడానికి రూ .6,300 కోట్లు investments హైదరాబాద్ విమానాశ్రయానికి రాబోతున్నాయి’’అని క్రోంబెజ్ చెప్పారు. రాష్ట్రంలో జయవంతంగా పనిచేస్తున్న ఫ్రెంచ్ కంపెనీలైన సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లు, మనే ఇండియా, సనోఫీ శాంత బయోటెక్ వంటి ఫ్రెంచ్ కంపెనీలతో శుక్రవారం ఈ conclave ప్రారంభమైంది.

ఈ సమావేశంలో కీలక పరిశ్రమలపై దృష్టి సారించేలా అనేక చర్చలు జరిగాయి. అధికారిక సెషన్‌లో భారతదేశంలో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్, IT, E&C, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు & వాణిజ్య శాఖల మంత్రి KTR, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సుమీత్ ఆనంద్, ఇండో-ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ అధ్యక్షుడు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి భారత్ లోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం, CCEF - ఫ్రెంచ్ విదేశీ వాణిజ్య సలహాదారులు, CII, ఫ్రెంచ్ టెక్, బిజినెస్ ఫ్రాన్స్, ఫ్రెంచ్, భారతీయ వ్యాపారాలకు చెందిన 100 మందికి పైగా చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్స్ (CXO లు) కలిసి వచ్చారు. దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, భారతదేశం, ఫ్రాన్స్‌లోని అగ్రశ్రేణి ప్రైవేట్ రంగ సంస్థలు, బహుపాక్షిక సంస్థలు, ప్రముఖ పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, భారతదేశంలో ఫ్రాన్స్ రాయబారి, ఇమ్మాన్యుయేల్ లెనైన్ మాట్లాడుతూ : ‘ఫ్రాన్స్, ఫ్రెంచ్ కంపెనీలు తెలంగాణలో తమ ఉనికిని పెంచడానికి అభివృద్ధి చెందుతున్న, ఆవిష్కరణ-ఆధారిత రాష్ట్రం అనేక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. అనేక ఫ్రెంచ్ గ్రూపులు ఇప్పటికే తెలంగాణలో, ముఖ్యంగా బయోటెక్, ఐటి,ఏరోనాటిక్స్‌లో పెట్టుబడులు పెట్టాయి. .తెలంగాణలోని కీలక రంగాలలో ఈ ఇండో-ఫ్రెంచ్ వ్యాపార ప్రయత్నాలు కూడా మన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి’ అన్నారు.

"ఈ విషయంలో, ఫ్రెంచ్ కంపెనీలు తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు ఫ్రెంచ్ తయారు చేసిన ప్రపంచ స్థాయి ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్‌కు సహకారం అందించడం ద్వారా కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో తెలంగాణతో solidarity ప్రదర్శించినందుకు నేను గర్వపడుతున్నాను." అన్నారు.

ఐటీ, పరిశ్రమలు & వాణిజ్య శాఖల మంత్రి కెటీఆర్ మాట్లాడుతూ, "తెలంగాణ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోని అనేక సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడానికి వినూత్న విధానాలను ప్రవేశపెడుతోంది" అన్నారు.

సరుకులు కొనడానికి వచ్చి రూ.10లక్షల చోరీ..!

TSiPASS విధానాన్ని హైలైట్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పదిహేను రోజుల్లో వివిధ పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదాలు ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వం రాష్ట్రానికి కోట్లాది పెట్టుబడులను ఆకర్షించిందని, ఈ ప్రాంతంలో లక్షలాది ఉపాధి అవకాశాలను సృష్టించిందని ఆయన అన్నారు.

ఐటీ, ఏరోస్పేస్, లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీలకు తెలంగాణ ఫేవరేట్ గమ్యస్థానంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అనేక ఫ్రెంచ్ కంపెనీలకు నిలయమని ఆయన అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాన్స్ నుండి ఇంకా చాలా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు.