హైద‌రాబాద్‌లో భారీగా హ‌వాలా న‌గ‌దు ప‌ట్టివేత‌.. రూ. 3.5 కోట్లు సీజ్..

హైదరాబాద్ గాంధీనగర్‌లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. 3.5 కోట్ల రూపాయల హవాల నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు కార్లను సీజ్ చేశారు.

Hyderabad 3 5 crore rupees hawala money seized 6 held in gandhi nagar

హైదరాబాద్ గాంధీనగర్‌లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. 3.5 కోట్ల రూపాయల హవాల నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు కార్లను సీజ్ చేశారు. హవాలా నగదును తరిలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గాంధీనగర్ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. భారీగా హ‌వాలా న‌గ‌దును త‌ర‌లిస్తున్న‌ట్లు నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్, గాంధీన‌గ‌ర్ పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో మారియ‌ట్ హోట‌ల్ వ‌ద్ద పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ క్రమంలో 2 కార్లలో తరలిస్తున్న రూ.3.5 కోట్లను లెక్కల్లో చూపని డబ్బును గుర్తించి సీజ్ చేశారు.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీగా హవాలా నగదు పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. శనివారం కూడా రూ. 2.49 కోట్ల హవాలా నగదును పోలీసులు పట్టుకున్నారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లో రూ.2.49 కోట్ల హవాలా డబ్బును స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. నిందితులను  బెంగళూరుకు చెందిన బోయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన బొచ్చు రాము, బేగంబజార్‌కు చెందిన సుధీర్ కుమార్ ఈశ్వర్‌లాల్ పటేల్, అశోక్ సింగ్‌లుగా గుర్తించారు. అనంతరం వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌ వద్ద వాహనాన్ని అడ్డగించగా..  రూ.2.49 కోట్ల లెక్కల్లో చూపని నగదును తరలిస్తున్నట్లు గుర్తించారు. పటేల్, అశోక్ సింగ్‌లను విచారించినప్పుడు.. రాము నుంచి నగదు స్వీకరించమని హవాలా ఆపరేటర్ లలిత్ ఆదేశించినట్లు వెల్లడించారు.

ఇక, చాంద్రాయణగుట్ట పోలీసులు కూడా ఇటీవల రూ. 79 లక్షల హవాలా నగదును స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. ఇద్దరూ స్క్రాప్ డీలర్లు సల్మాన్ మల్లిక్, ఇమ్రాన్ మల్లిక్ తో పాటు తమ్మా వెంకటేశ్వర్ రెడ్డి, ఇ.శేఖర్‌లను మహబూబ్ నగర్ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios