గుంతల మయంగా రహదారులు పెరుగుతున్న యాక్సిండెట్లు

బంగారు తెలంగాణకు బాటలు పరుస్తామంటూ ఊదరగొట్టిన గులాబీ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. బంగారు బాటలు దేవుడెరుగు నడిచే బాటే ఇప్పుడు నరకంగా మారింది. పట్టణాలలో రోడ్లన్నీ ఇప్పుడు నరకాని నకళ్లుగా మారాయి. ఇక హైదరాబాద్ రహదారుల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. రోజూ మూడు యాక్సిడెంట్ లు ఆరు మరణాలతో నెత్తు ‘రోడ్డు’తూనే ఉన్నాయి.

ఆ మధ్య రమ్య, ఇటీవల సంజన ఇలా చెప్పుకూంటూ పోతే హైదరాబాద్ రోడ్లు బలితీసున్న ప్రాణాలెన్నో... గుంతల రోడ్లు, బందుబాబుల నిర్లక్షపు డ్రైవింగ్, అధికారుల అలసత్వం వెరసి హైదరాబాదీని రోడ్డు ఎక్కకుండా చేస్తున్నాయి. ఇంత జరుగుతున్న సీఎం కానీ మున్సిపల్ మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు కేటీఆర్ కానీ ఈ విషయంపై కాస్త కూడా ద్రుష్టి పెట్టడం లేదు. ఓవైపు మెట్రోపనులు.. మరోవైపు వివిధ అవసరాలకోసం ఇష్టం వచ్చినట్టు రోడ్లను తవ్విపోస్తుండటంతో సిటీలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కూకట్‌పల్లి, శ్రీనగర్‌కాలనీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్లు గుంతల మయంగా మారాయి.

 గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 9 వేల కి.మీ. వరకు రోడ్లు విస్తరించి ఉన్నాయి. వీటి నిర్వహణ అంతా జీహెచ్‌ఎంసీదే. 
అయితేసాఫ్ట్ వేర్ కంపెనీలు ఉండే హైటెక్ సిటీ, మాదాపూర్సె, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర రిచ్ స్ట్రీట్ రోడ్ల మీద జీహెచ్ఎంసీ చూపిస్తున్న శ్రద్ధ నగరంలో 90 శాతం ఉండే ఇతర కాలనీల మీద మాత్రం చూపడం లేదు. అక్కడ వైటాపింగ్ రోడ్లు, సైక్లింగ్ వే ల పేరుతో నిధులన్నీ ఖర్చు చేస్తున్న సర్కారు ఇటు మధ్యతరగత కాలనీలు ఉండే చోట కనీసం గుంతలు కూడా పూడ్చడం లేదు. అదేమంటే వర్షాకాలం అయిపోతేనే రోడ్ల మరమ్మతులు చేయగలుతామని అప్పటి వరకు గుంతలను చూసుకుంటు వెళ్లాలని ఓ ఉచిత సలహా ఇస్తుంది.