హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి ఘన విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి రెడ్డి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక బీజేపీ, టీడీపీ అభ్యర్ధులకు డిపాజిట్ కూడ దక్కలేదు.

 హుజూర్‌నగర్ అసెంబ్లీ స్తానంలో  టీఆర్ఎస్‌ అభ్యర్ధి సైదిరెడ్డికి 1,12,796 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డికి   69,563 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధి కోట రామారావు, టీడీపీ  అభ్యర్ధి చావా కిరణ్మయికి 1827 ఓట్లు వచ్చాయి.

 ఇక కాంగ్రెస్ పార్టీ తర్వాత మూడో స్థానంలో సుమన్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి 2693 ఓట్లు వచ్చాయి. సుమన్ కంటే టీడీపీ, బీజేపీ అభ్యర్ధులకు తక్కువ ఓట్లు వచ్చాయి. 

read more  Huzurnagar Election Result: 20 ఏళ్ల ఉత్తమ్ కోట బద్దలు, ఒక్కసారి చూద్దామని సైదిరెడ్డికి...

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  మొదటి రౌండ్ నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి ఆధిక్యతను కనబరుస్తున్నాడు. తొలి రౌండ్‌ నుండి సైదిరెడ్డి ఆధిక్యత పెరుగుతూనే వచ్చింది. టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ఏ రౌండ్‌లో కూడ కాంగ్రెస్ అడ్డుకోలేకపోయింది.

గురువారం నాడు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఓట్లను లెక్కించారు.సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 

మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించేందుకు గాను 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ పది నిమిషాలకు ఒక్క రౌండ్ ఫలితం వచ్చింది. ఈ నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 751. మండలానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపట్టారు.

read more  #Huzurnagar result: రికార్డు బద్దలు కొట్టిన సైదిరెడ్డి

ఇక హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ  అభ్యర్ధులకు డిపాజిట్లు కూడ దక్కలేదు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 1515 ఓట్లు వచ్చాయి.ఈ ఎన్నికల్లో నోటా కంటే బీజేపీ అభ్యర్ధి 1515 ఓట్లు వచ్చాయి. 

ఈ దఫా బీజేపీ అభ్యర్ధి కోట రామారావుకు గతంలో కంటె ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 2621 ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్ధి చావా కిరణ్మయికి 1827 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో 25,395 ఓట్లు టీడీపీ అభ్యర్ధి వంగాల స్వామిగౌడ్ కు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ  ఈ స్థానంలో పోటీ చేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది.     


హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి వచ్చిన మెజారిటీ 

1వ రౌండ్-2467
2వ రౌండ్-4000
3వ రౌండ్-6750
4వ రౌండ్-9356
5వ రౌండ్-11000
6వ రౌండ్-12767
7వ రౌండ్-14300
8వ రౌండ్-17687
9వ రౌండ్-19356
10వ రౌండ్-22000
11వ రౌండ్-21618
12వ రౌండ్-23828
13వ రౌండ్-25366
14వ రౌండ్-26999
15వ రౌండ్-29967
16వ రౌండ్-32256
17వ రౌండ్-34506
18వ రౌండ్-36112
19వ రౌండ్-38344
20వ రౌండ్-40547
21వ రౌండ్-42484
22వ రౌండ్-43284