సూర్యాపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎట్టిపరిస్థితుల్లో నమ్మెుద్దని సూచించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ది లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నారని వాటిని ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు. 

హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని తానుఎంతో అభివృద్ధి చేసినట్లు చెప్పుకొచ్చారు. తాను చేసిన అభివృద్ధికి ప్రజలు మద్దతు పలుకుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారని చెప్పుకొచ్చారు. 

మరోవైపు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలతోనే తాను ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు. త్వరలోనే గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తో భేటీ కానున్నట్లు చెప్పుకొచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.