హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో  భాగంగా సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అదికారి తిరస్కరించారు. ఎన్నికల రిటర్నింగ్ అదికారిపై చర్యలు తీసుకోవాలని  సీపీఎం నేతలు, కార్యకర్తలు హుజూర్‌నగర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

ఎలాంటి తప్పులు లేకున్నా కూడ పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ ను తిరస్కరించారని సీపీఎం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నామినేషన్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 2014,2018 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి శేఖర్ రావు పోటీ చేశాడు. 

ఈ రెండు ఎన్నికల్లో  శేఖర్ రావు నామినేషన్లను సక్రమంగా ఉన్నట్టుగా అధికారులు గుర్తించిన విషయాన్ని సీపీఎం నేతలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.   ఫారం-26తో పాటు, కుల సర్టిఫికెట్ కు సంబంధించిన విషయమై పూర్తి అప్‌డేట్ లేదని రిటర్నింగ్ అధికారి సీపీఎం అభ్యర్ధి శేఖర్ రావు నామినేషన్ ను తిరస్కరించారు.