ఈటలకు షాక్... టీఆర్ఎస్ కే మద్దతంటూ రైస్ మిల్లర్ల ఏకగ్రీవ తీర్మానం

శుక్రవారం  హుజురాబాద్ సిటీ సెంటర్ హాల్ లో హుజురాబాద్ నియోజకవర్గంలోని110 రైస్ మిల్లర్ల ప్రతినిధులతో రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమావేశం నిర్వహించారు.

Huzurabad rice millers Unanimous decision to support TRS  akp

ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసాక టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా వుండాలని నిర్ణయించుకున్నట్లు హుజురాబాద్ పరిధిలోని రైస్ మిల్స్ యాజమాన్యం ప్రకటించింది. రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దత్తుగా నిలిచి గెలిపిస్తామని హుజురాబాద్  నియోజకవర్గంలోని 110 రైస్ మిల్లుల ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కు మద్దతు లేఖను అందించారు.

శుక్రవారం  హుజురాబాద్ సిటీ సెంటర్ హాల్ లో హుజురాబాద్ నియోజకవర్గంలోని110 రైస్ మిల్లర్ల ప్రతినిధులతో రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రికార్డు స్థాయి ధాన్యం మిల్లింగ్ అవకాశం కల్పించి అండగా ఉన్న ప్రభుత్వానికి ఎల్లవేళలా రైస్ మిల్స్ యాజమాన్యాలు మద్దతుగా నిలుస్తున్నాయంటూ అభినందించారు. సర్కారు అందిస్తున్న ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రైస్ మిల్లర్లు సంపూర్ణంగా టీఆర్ఎస్ పక్షానే నిలుస్తామని వెల్లడించడం శుభపరిణామం అన్నారు. 

''ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో కేవలం యాసంగి సీజన్లోనే 92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థే సేకరించింది... ఈ రికార్డులో రైస్ మిల్లర్ల భాగస్వామ్యం మరవలేనిది. ఈ ధాన్యాన్ని నిల్వ చేయడంతో పాటు మిల్లింగ్ చేయడంలో సహకరిస్తున్న రైస్ మిల్లర్లకు అభినందనలు. రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో మిల్లర్లు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యను పరిష్కరిస్తాం'' అని మంత్రి గంగుల హామీ ఇచ్చారు.

read more  ఇన్నాళ్లూ మంత్రిగా వెలగబెట్టి.. హుజురాబాద్‌కు ఏం చేశారు: ఈటలపై మరోసారి గంగుల విమర్శలు

''తెలంగాణ స్వరాష్ట్రంగా సిద్దించక ముందు బీడు భూములతో నెర్రెలు బారిన నెలలు, గిట్టుబాటు లేక ఆత్మహత్య చేసుకునే రైతులు, కరెంట్ కష్టాలతో రైతులు పడ్డ ఇబ్బందులు మరవలేం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దుర్గతిని రూపుమాపాలనే సంకల్పంతోనే తెలంగాణ సాదించారు. ఇవాళ కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కష్ట కాలంలోనూ రైతు పండించిన ప్రతీ గింజను మద్దతు దరతో కొనుగోలు చేయడమే కాక మూడు రోజుల్లోపు రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్న ఘనత దేశంలో తెలంగాణది మాత్రమే.  24గంటల నాణ్యమైన కరెంట్ తో పాటు, పెట్టుబడి సాయంగా రైతు బందు, రైతు బీమా వంటి పథకాలతో వ్యవసాయం దిశనే మార్చేశారు'' అంంటూ కొనియాడారు. 

''ఐతే ఇది కంటగింపుగా చేసుకొన్న కొందరు పథకాలను పరిగెలతో పోల్చారు, పెందింట్లో కళ్యాణకాంతులు వెదజల్లే కళ్యాణలక్ష్మిని సైతం అవమానించారు. వారికి బుద్ది చెప్పాలి. కేసీఆర్ ని ఎదురిస్తే ముఖ్యమంత్రి పదవి వస్తుందనే దురాశతో ఈటెల చేసిన కుట్రలు నీచమైనవి. హుజురాబాద్ నియోజకవర్గ అభివ్రుద్దిని గాలికొదిలేసి స్వలాభం కోసం రాజకీయాల్ని వాడుకోవడం హేయం. ఈటల హయాంలో హుజురాబాద్ అన్ని రంగాల్లో వెనుకకు నెట్టేయబడింది, ప్రధాన రహదారులన్నీ గుంతలమయం అయ్యాయి. ఈ దురవస్థను తొలిగిపోవాలంటే టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచి రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకొవాలి. టీఆర్ఎస్ గెలిస్తేనే అభివ్రుద్ది గెలిచినట్టు'' అని గంగుల కమలాకర్ అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios