హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు పార్టీ చేసిందిదే..? 3 వేల ఓట్లకే పరిమితం..
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎవరూ విజయం సాధిస్తారని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసారు. చాలా చోట్ల బెట్టింగ్‌లు కూడా నడిచాయి. పోలింగ్ ముందు భారీగా తాయిలాలు, డబ్బు పంపిణీ జరింది. ఈ ఎన్నికలో ఎంతో కొంత ప్రభావం చూపుతుందని భావించిన కాంగ్రెస్.. కేవలం మూడు వేల ఓట్లకు పరిమితమైంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎవరూ విజయం సాధిస్తారని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసారు. చాలా చోట్ల బెట్టింగ్‌లు కూడా నడిచాయి. పోలింగ్ ముందు భారీగా తాయిలాలు, డబ్బు పంపిణీ జరింది. ఈ ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. అయితే ఈ ఎన్నిల్లో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ప్రధానంగా ఈటల రాజేందర్, గెల్లు శ్రీనివాస్ మధ్య పోరు నడించింది. ఎంతో కొంత ప్రభావం చూపుతుందని భావించిన కాంగ్రెస్.. కేవలం మూడు వేల ఓట్లకు పరిమితమైంది.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో Huzurabad నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి 61 వేలకు పైగా ఓట్లు సాధించాడు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచిన ఈటల రాజేందర్ లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే కొన్ని నెలల క్రిత చోటుచేసున్న రాజకీయ పరిణామల నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీ గూటికి చేరారు. పాడి కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎస్ గూటికి చేరారు.
అయితే ఎలా చూసినా Congress Party హుజురాబాద్‌లో కనీసం ప్రభావం చూపకపోవడం వెనక ఒకటే ప్రధాన కారణం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య జరగలేదని.. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్‌గా సాగాయని కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగగానే చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సైలెంట్‌గా వ్యవహరించిందని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలకుండా ఉండేలా చూసింది. ఆ ఓట్లు ఈటల వైపు మళ్లాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
హుజురాబాద్‌లో కాంగ్రెస్ ప్రచారానికి పీసీపీ చీఫ్ Revanth Reddy, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు మాత్రమే కనిపించారు. రాష్ట్ర స్థాయి కీలక నేతలు ఎవరూ కూడా అటువైపు చూడలేదు. 2018లో 61 వేలకు పైగా ఓట్లు సాధించినా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అందుకే ప్రభావం చూపలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. బరిలో అభ్యర్థి నిలిపి.. ప్రచారం చేసినప్పటికీ కూడా చివర్లో ఓట్లు చీలకుండా జాగ్రత్త పడిందని అంటున్నారు. అంతేకాకుండా ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ శ్రేణులు వ్యుహాత్మక మౌనాన్ని పాటించాయి. ఇదే ఇప్పుడు ఈటలకు పరోక్షంగా ప్లస్ అయింది.
హుజురాబాద్ ఫలితాలు ఊహించినట్లుగానే వస్తున్నాయని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అప్రజాస్వామికంగా మంత్రి వర్గం నుంచి తొలగించారనే అంశాన్ని ఈటల ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని ప్రభాకర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలు జీర్ణించుకోలేకపోయారని.. ఇది బీజేపీ విజయంగా బండి సంజయ్ చెప్పడం దురదృష్టకరమని పొన్నం ఎద్దేవా చేశారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈటల రాజేందర్‌కు పరోక్షంగా మద్దతిచ్చినట్టుగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. శత్రువుకు శత్రువు మిత్రుడు.. అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ శత్రువయిన ఈటల రాజేందర్‌కు మేం మద్దతు ఇవ్వక తప్పలేదని రాజకీయంగా తీవ్ర చర్చను లేవనెత్తారు కోమటిరెడ్డి. తాము గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి ఉండేవని.. అలా జరిగితే టీఆర్‌ఎస్ లాభపడేదని వ్యాఖ్యానించారు.