Asianet News TeluguAsianet News Telugu

Huzurabad bypoll: ఈటల రాజేందర్ వాహనం సీజ్.. ఆయన పీఆర్పోను అదుపులోకి తీసుకన్న పోలీసులు..

పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలోని  కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థఇ ఈటల రాజేందర్ కాన్వాయ్‌లోని మూడు వాహనాలనకు పోలీసులు అడ్డుకున్నారు. అందులో ఒక వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. 

Huzurabad bypoll updates Etela rajender Vehicle seized
Author
Huzurabad, First Published Oct 30, 2021, 5:45 PM IST

హుజురాబాద్ ఉప ఎన్నిక కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు 76 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలోని  కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థఇ ఈటల రాజేందర్ కాన్వాయ్‌లోని మూడు వాహనాలనకు పోలీసులు అడ్డుకున్నారు. అందులో ఒక వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈటల రాజేందర్ పీఆర్వో చైతన్య‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాన్ని సీజ్ చేశామని కమలాపూర్ సీఐ కిషన్ తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇక, ఎన్నికల ప్రవర్తనా నియమాళికి విరుద్దంగా ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహిస్తున్నారని, మీడియాతో మాట్లాడని టీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపించాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆయన ఓటర్లను ప్రలోభ పెట్టారని టీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపించాయి.

Also read: Huzurabad bypoll Live Update: హుజురాబాద్ ఉప ఎన్నిక లైవ్ అప్‌డేట్స్..

ఇదిలా ఉంటే.. ఉదయం నుంచి టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. డబ్బు పంపిణీ, స్థానికేతరులు.. వంటి విషయాల్లో టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్, జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ పరిశీలించారు. 

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందాయని శశాంక్ గోయల్ తెలిపారు. వాటిపై ఎన్నికల పరిశీలకుల వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. విచారణ నిజాల తెలితే ఎన్నికల తర్వాత కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Also read: Huzurabad bypoll: ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల దంపతులు.. ఈరోజు కూడా డబ్బు పంచుతున్నారు.. ఈటల కామెంట్స్

ఇక, హుజురాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. భారీ స్థాయిలో ఓటింగ్ నమోదవుతుంది. పోలింగ్ సాయంత్రం ఏడు గంటల వరకు జరిగనుంది. హుజురాబాద్ నియోజకవర్గం లో 306 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసారు.. నియోజకవర్గం లోని ఐదు మండలాలలో మొత్తం 2,37,036 ఉండగా పురుషులువ1,17,933 కాగా స్త్రీలు 1,19,102 ఉండగా ఇతరులు ఒక్క ఓటరు ఉన్నారు..ఇక హుజురాబాద్ ఉప ఎన్నికలని కోవిడ్ నిబంధనాలు అనుసరించి నిర్వహించారు..నియోజకవర్గం లో  144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ కన్నల్ ఇప్పటికే తెలిపాడు..ఉప ఎన్నిక కొసం 421 కంట్రోల్ యూనిట్లు,891 బ్యాలెట్ యూనిట్లు,515 వివి ప్యాడ్ యూనిట్లని వినియోగించారు... మొత్తం 1715 మంది సిబ్బందిని వినియోగించారు..నిన్న సాయంత్రం లొగా పోలింగ్ సిబ్బంది తమకి కెటాయించిన సామాగ్రితో తమకి కెటాయించిన పోలింగ్ కేంద్రాలకి చేరుకున్నారు..306 పోలింగ్ స్టేషన్ లలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించారు..!

పోలింగ్ కేంద్రం నకి వచ్చే ప్రతి ఓటరు సానిటైజ్ చేసుకొనేలా ఏర్పాటు చేసారు..ప్రతి పోలింగ్ కేంద్రంలో హెల్త్ వర్కర్స్ థర్మమీటర్ తో టెంపరేచర్ ని పరీక్షించి లోపలికి పంపుతారు..ఓటు హక్కు వినియోగించుకునే కోవిడ్ పేషెంట్ లకి ప్రత్యేక పిపిఈ కిట్లు,కుడి చెతికి గ్లౌజులు సిద్దం గా ఉంచారు..సోషల్ మిడియాలో వచ్చే ఫేక్ వార్తలు నమ్మవద్దని ప్రజలు శాంతియుత వాతావరణం లో ఓటు హక్కు,స్వేచ్ఛా గా వినియోగించుకోవాలని కోరారు..3880 మంది పోలిసులతో పటిష్ఠమైన బందోభస్తుని ఏర్పాటు చేసారు..

ఈటెల అక్రమాలకు పాల్పడ్డాడనే కారణంతో ఆయనపై సీఎం కేసీఆర్ విచారణ చేపట్టడం... ఆవెంటనే ఈటెల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం... ఆ తరువాత తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.  ఈ నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నికల్లో తెరాస తరుఫు నుంచి విద్యార్ధి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా... బీజేపీ నుంచి ఈటెల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచాడు. ప్రధానంగా పోటీ ఈ మూడు పార్టీల మధ్యనే నెలకొన్నప్పటికీ... కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు విజేతను నిర్దేశించనున్నాయి..!

Follow Us:
Download App:
  • android
  • ios