మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓ వెదవ సన్నాసి అంటూ చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేవని తేలిపోయినా అక్కడ రాజకీయ వాతావరణం మాత్రం చల్లారడంలేదు. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ పై చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విరుచుకుపడ్డారు. 

''ఈటల దురహంకారంతో వాపును చూసి బలుపుగా భావిస్తున్నాడు. రాజకీయ జీవితాన్నిచ్చిన కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీకే వెన్నుపోటు పొడిచి బయటికి వచ్చాడు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ చొప్పదండిలో సొంతపార్టీ అభ్యర్థినైన తనను ఓడించాలని ఈటల చూశాడు. ఇందుకోసం బిజెపి అభ్యర్థి బొడిగే శోభకు డబ్బులు పంపించాడు'' అని రవిశంకర్ ఆరోపించారు. 

వీడియో

''హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇంటిని కూడా ఈటల దళితులకు ఇవ్వలేదు. అలాంటి దళిత వ్యతిరేకి తనను వెధవ అంటూ సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడు. ఆయనే ఓ వెధవ సన్నాసి'' అని ఎమ్మెల్యే మండిపడ్డారు. 

read more హరీశ్, కొప్పుల ఈశ్వర్ ముందే.. గడియారం పగులగొట్టి, గొడుగు చించేసి, ఈటలకు షాకిచ్చిన యువకుడు

''దళితుల వ్యతిరేకి ఈటల రాజేందర్ చివరకు దళితుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న బిజెపిలో చేరాడు. ఆ తర్వాత కూడా దళితులను మభ్య పెట్టే ప్రయత్నం చేశాడు. మొదట దళిత బంధు రాదని ప్రచారం చేసిన ఈటల ఇప్పుడు తన వల్లే దళిత బంధు వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్నాడు'' అని ఎమ్మెల్యే రవిశంకర్ మండిపడ్డారు. 

''తమరికి మెదడు మోకాళ్లకు జారినట్టు ఉన్నది. అందుకే మతిభ్రమించి మాట్లాడుతున్నవ్. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు... లేకపోతే నీ భాషలోనే సమాధానం ఇస్తాం జాగ్రత్త'' అని ఈటలను రవిశంకర్ ట్విట్టర్ వేదికన హెచ్చరించారు.