Asianet News TeluguAsianet News Telugu

Huzurabad by poll: టీఆర్ఎస్‌కి గుర్తుల టెన్షన్, పక్కా వ్యూహాంతో గులాబీ దళం

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి ఎన్నికల గుర్తు టెన్షన్ చోటు చేసుకొంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ నేతలు డమ్మీ ఈవీఎంలతో ప్రచారం చేస్తున్నారు. 

Huzurabad bypoll: Now, TRS drive against copycat poll symbol ..
Author
Karimnagar, First Published Oct 24, 2021, 1:17 PM IST

హుజూరాబాద్: తమ పార్టీ ఎన్నికల గుర్తులను పోలిన గుర్తులతో Trsకి చిక్కులు వచ్చాయి. ఇదే తరహ గుర్తులతో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అవపజయాలను మూట గట్టుకొన్నాయి. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జాగ్రత్తగా టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు Carను పోలిన గుర్తులతో  గులాబీ పార్టీ విజయావకాశాలను దెబ్బతీశాయి. Huzurabad bypoll ఎన్నికల్లో సింబల్‌ టెన్షన్ పట్టుకుంది. ఎన్నిక ఏదైనా ఒకేలా ఉన్న గుర్తులతో అధికార  టీఆర్ఎస్ కి ఇబ్బందులు తప్పడం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో  27 మంది ఇండిపెండెంట్ అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్ధులకు కేటాయించిన గుర్తులు టీఆర్ఎస్ కు గుబులు పుట్టిస్తోంది.

also read:డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్: రేవంత్ రెడ్డి సంచలనం

ఈ ఉప ఎన్నికలోనూ రోడ్‌ రోలర్‌, చపాతీ మేకర్‌, హెలికాఫ్టర్‌ గుర్తులు అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి.  గతంలో కూడ ఇదే తరహ ఎన్నికల గుర్తులు గులాబీ పార్టీకి చెమటలు పుట్టించాయి.  ఆ పార్టీ అభ్యర్ధుల గెలుపు ఓటములను తారుమారు చేశాయి. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకొంటుంది.డమ్మీ ఈవీఎంలతో టీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.  టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. కారు గుర్తును పోలిన గుర్తులపై ఓటర్లను అప్రమత్తం చేస్తున్నారు.

2014తో పాటు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడ ఇదే తరహ ఇబ్బందులు టీఆర్ఎస్ ఎదుర్కొంది. దీంతో కారు గుర్తును పోలిన గుర్తులను ఇండిపెండెంట్ అభ్యర్ధులకు ఇవ్వొద్దని టీఆర్ఎస్  పార్టీ ఈసీని కోరింది. ఆటో, ట్రక్కు, రోడ్డు రోలర్‌, రోటీ మేకర్‌ వంటి ఎన్నికల గుర్తు కారుజోరుకు కళ్లెం వేశాయి.గతంలో వచ్చిన ఎన్నికల ఫలితాల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.2018  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీకి ట్రక్కు గుర్తు వచ్చింది.  ఆ పార్టీ 30 సీట్లలో పోటీచేసింది. సమాజ్‌వాదీ పార్టీ టీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపు ఓటములపై ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకలు భావిస్తున్నారు.

భువనగరి పార్లమెంటు ఎన్నికల్లో కూడా బూరనర్సయ్యగౌడ్‌ ఇలాగే ఓడిపోయారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.  కారు గుర్తును పోలిన ఎన్నికల గుర్తులకు భారీగా ఓట్లు నమోదు కావడాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ నేతలు డమ్మీ ఈవీఎంలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios