Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll: బిజెపి శ్రేణులపై టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ దాడి... జమ్మికుంటలో ఉద్రిక్తత

హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి బుధవారంతో తెరపడిన విషయం తెలిసిందే. అంతకు ముందే ప్రచారం నిర్వహిస్తున్న తమపై టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ దాడికి పాల్పడినట్లు బిజెపి కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

Huzurabad Bypoll: jammikunta municipal chairman rajeshwar rao attacks bjp leaders
Author
Huzurabad, First Published Oct 28, 2021, 10:37 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో కీలకమైన పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్ది ఉద్రిక్తత ఏర్పడుతోంది. ఇప్పటివరకు పార్టీల మధ్య మాటల యుద్దమే సాగగా తాజాగా ఓ పార్టీ శ్రేణులపై మరో పార్టీ వర్గీయులు బౌతిక దాడులకు దిగుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో తాము ప్రచారం నిర్వహిస్తుంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక ముున్సిపల్ ఛైర్మన్ దాడికి పాల్పడినట్లు బిజెపి కార్యకర్త వంశీ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఘటనతోjammikunta లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. 

తమపై జరిగిన దాడి గురించి బాధితుడు వంశి మాట్లాడుతూ... జమ్మికుంట పట్టణంలోని మేదరవాడలో వరంగల్ నుండి వచ్చిన bjp నేతల, కార్యకర్తలతో కలిసి బుధవారం ప్రచారంలో పాల్గొన్నానని తెలిపారు. తాము బిజెపి అభ్యర్థి eatala rajender కు మద్దతుగా ప్రచారం చేస్తుండగా trs నాయకుడు, పట్టణ మున్సిపల్ ఛైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు కారులో అక్కడిని వచ్చాడని తెలిపాడు. తమను చూసిన వెంటనే కారుదిగిన ఆయనతో పాటు డ్రైవర్ రషీద్, అనుచరులు దాడికి పాల్పడినట్లు వంశీ తెలిపాడు.

బిజెపి తరపున ప్రచారం చేయకూడదంటూ అడ్డుకుని దాడిచేయడమే కాదు సెల్ ఫోన్లను కూడా లాక్కున్నారని పేర్కొన్నాడు. అసభ్య  పదజాలంతో దూషిస్తూ దాడిచేసారని... ఈ దాడిలో పలువురు బిజెపి కార్యకర్తలకు గాయాలయ్యాయని వంశీ తెలిపాడు. స్థానికుడినైన తనను ఎక్కువగా టార్గెట్ చేసి దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. 

వీడియో

తమపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వంశీ వెల్లడించాడు. టీఆర్ఎస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని... అందువల్లే  బిజెపి ప్రచారాన్ని అడ్డుకుని దాడులకు తెగబడుతున్నారని వంశీ ఆరోపించాడు. తమపై దాడిచేసిన వారిపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని అతడు డిమాండ్ చేసాడు.

ఇక హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నిక ప్రచార గడువు బుధవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో స్థానికేతరులు వెంటనే నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలని ఎన్నికల సంఘం, పోలీసులు ఆదేశించింది.ఈ నెల 30వ తేదీన పోలింగ్, నవంబర్ రెండున ఓట్ల లెక్కింపు జరుగి ఫలితం వెలువడనుంది. 

read more  Huzurabad Bypoll: మా సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది... ఈటలదే బంపర్ మెజారిటీ: బండి సంజయ్

 హుజూరాబాద్ ఉపఎన్నికలో మొత్తం 30 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్ధులు మినహా మిగిలినవారంతా ఇండిపెండెంట్లే  Bjp అభ్యర్ధిగా మాజీ మంత్రి eatala rajender,  Trs అభ్యర్ధిగా Gellu Srinivas Yadav, కాంగ్రెస్ అభ్యర్ధిగా Balmuri Venkat బరిలో నిలిచారు. మిగిలిన వారంతా స్వతంత్రులే. 

హుజూరాబాద్  అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,36,283 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,18,720 ఓటర్లున్నారు. 1,17,563 మంది మహిళ ఓటర్లున్నారని ఈసీ ప్రకటించింది. 305 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది.

ఈ అసెంబ్లీ స్థానం నుండి 2009 నుండి ఈటల రాజేందర్ వరుసగా టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. అయితే ఇటీవల చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ ఈ ఏడాది జూన్ 14న బీజేపీలో చేరారు. అంతకు రెండు రోజుల ముందే ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఇలా టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసి బిజెపిలో చేరిన క్షణంనుండే హుజురాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అప్పటినుండి అంటే దాదాపు నాలుగు నెలలనుండే బీజేపీ, టీఆర్ఎస్‌లు రంగంలోకి దిగి ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇలా సుదీర్ఘ ప్రచారానికి నిన్నటితో తెరపడటంతో తాజాగా బౌతిక దాడులు మొదలయ్యాయి. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios