Asianet News TeluguAsianet News Telugu

Huzurabad bypoll: ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించిన ఈసీ

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించినట్టుగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కర్ణన్‌ ప్రకటించారు.ఈ నెల 30వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేస్తారు.

huzurabad bypoll:  Exit polls on Huzurabad by-election banned
Author
Karimnagar, First Published Oct 15, 2021, 5:04 PM IST

కరీంనగర్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం huzurabad bypollలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలపై నిషేధం విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్‌ 126 (ఎ) ప్రకారం అక్టోబర్‌ 30 రాత్రి 7.30 గంటల వరకు ఎలాంటి exit poll నిర్వహించరాదని, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అతిక్రమించి ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించినా మీడియాలో ప్రసారం చేసినా కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.

also read:Huzurabad bypoll: బరిలో 27 మంది ఇండిపెండెంట్లు, ఎవరి కొంపముంచుతారో?

అసైన్డ్ భూములు, దేవాదాయశాఖ భూములను ఆక్రమించారని మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను కేసీఆర్ భర్తరఫ్ చేశారు. దీంతో ఈ ఏడాది జూన్ 12న ఎమ్మెల్యే పదవికి  Etela Rajender ఆమోదించారు.రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రోజునే ఆయన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. దీంతో ఈ నెల 30న హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ఈ స్థానం నుండి 2009 నుండి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా వరుసగా విజయాలు సాధించారు. కానీ ఈ దఫా ఈ స్థానం నుండి ఆయన Bjpఅభ్యర్ధిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారుTrs అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, Congres అభ్యర్ధిగా బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు.

ఈ స్థానం నుండి 30 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్ధులు మినహా మిగిలిన 27 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు.హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో ఈటలను ఓడించాలని టీఆర్ఎస్, రాజేందర్ ను గెలిపించాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ రెండు పార్టీలు కూడ ఈ అసెంబ్లీ స్థానంలో  కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios