Huzurabad Bypoll: నన్ను సాదుకుంటారో లేక సంపుకుంటారో మీ ఇష్టం..: ఈటల భావోద్వేగం
హుజురాబాద్ ఉపఎన్నికలో తనను ఎలాగయినా ఓడించాలన్న కసితో సీఎం కేసీఆర్ ఉన్నారని.. సాదుకుంటారో లేక సంపుకుంటారో మీ ఇష్టం అంటూ ఈటల రాజేేందర్ భావోద్వేగభరిత కామెంట్స్ చేసారు.
కరీంనగర్: ఎలాగయినా తనను ఓడించి తీరాలన్న కసితో సీఎం కేసీఆర్ ఉన్నారని... ఇందుకోసం డబ్బులు, ధావత్ లనే టీఆర్ఎస్ నమ్ముకుందని మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. అసలు ఏం తప్పు చేసానని హుజురాబాద్ ప్రజలు నాకు ఓటు వేయవద్దు చెప్పండి అని eatala rajender ప్రశ్నించారు. నన్ను సాదుకుంటారో లేక సంపుకుంటారో మీఇష్టం...కానీ ప్రాణం ఉన్నంతవరకు KCR తో కోట్లాడతా అన్నారు ఈటల రాజేందర్.
Huzurabad నియోజవకర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో ఈటల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎక్కడెక్కడి నుండో TRS నాయకులు వచ్చి తన గురించి అబద్దాలను ప్రచారం చేస్తున్నారన్నారు. కొందరయితే గుండెలు గాయపడెలా మాట్లాడుతున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేసారు.
''టీఆర్ఎస్ నాయకులు నేను అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు. నేను పని చెయ్యకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా? ఈ నియోజకవర్గంలో అన్నీ గ్రామాలకు మంచి రోడ్లు వేసుకున్నాము. కాలువలు అన్నీ బాగుచేసుకుని పొలాలు ఎండిపోకుండా కాపాడుకున్నాం. మానేరు మీద చెక్ డ్యాంలు కట్టుకొని జలకళ ఉట్టిపడేలా చేసుకొన్నాము'' అని ఈటల వివరించారు.
read more Huzurabad Bypoll: టీఆర్ఎస్ వాళ్లిచ్చే పైసలు తీసుకోండి.. బీజేపీకి ఓటేయండి: బండి సంజయ్
''కేసిఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండ పనిచేసా. వారి జెండాను తెలంగాణ అంతా ఎగిరేలా చేసా. నా పనిని గుర్తించి పదవులు ఇచ్చారు... చివరకు చాలా అవమానకరంగా బయటికి పంపించారు'' అంటూ టీఆర్ఎస్ లో తన జర్నీని గుర్తుచేసుకున్నారు ఈటల.
''టీఆర్ఎస్ ను ఓడిస్తే పెన్షన్, రేషన్ కార్డు పోతుందని టీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారట. అవేమి కేసిఆర్ అబ్బ జాగీరు కాదు.... అది మన సొమ్ము. ప్రజల హక్కు హరించడానికి కేసిఆర్ ఎవరు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నావు కదా కేసిఆర్... మరి 65 రోజులుగా ఎందుకు దళిత బంధు ఇవ్వలేదు'' అని ఈటల నిలదీసాడు.
''తాము dalit bandhu ను ఆపాలని ఈసీకి రాసినట్లుగా దొంగ ఉత్తరాలు తయారుచేశారు. ఇలా మేము రాయలేదని చేల్పుర పోచమ్మ టెంపుల్ కి రమ్మని కేసిఆర్ కు సవాలు చేస్తున్నా. దళిత బంధు వెంటనే ఇవ్వాలి అని కోర్టును ఆశ్రయించాము'' అని ఈటల తెలిపారు.
''ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి ఇవ్వరు. రైతు రుణ మాపీ ఇవ్వరు. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల్లారా... మీకు సిగ్గుందా? ఇందుకా మీ ప్రజలు ఓట్లు వేసింది. నా మొఖం చూపకుండా ఓట్లు అడగలేని దుస్థితికి టీఆర్ఎస్ వారు వచ్చారు'' అని పేర్కొన్నారు.
''నిజాంలాగా నీది, నీ కొడుకు కేటీఆర్, నీ మనవడు హిమాన్షుది కాదు ఈ రాజ్యం... ఇది ప్రజాస్వామ్యం. చరిత్ర నిర్మాణం చేసేది ప్రజలు. గడ్డి బండి కింద కుక్క లాగా... కేసిఆర్ మనల్ని మొస్తున్నానని అనుకుంటున్నారు" అని ఈటల తీవ్ర విమర్శలు చేసారు.