తెలంగాణ బిజెపికి షాక్... టీఆర్ఎస్ గూటికి హుజురాబాద్ కౌన్సిలర్ ప్రతాప మంజుల

ఓవైపు టీఆర్ఎస్ పార్టీని వీడి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో బిజెపి నాయకులకు టీఆర్ఎస్ గాలం వేస్తోంది.

huzurabad bjp councillor manjula joins trs party akp

కరీంనగర్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ ను మంత్రిమండలి నుండి భర్తరప్ చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓవైపు టీఆర్ఎస్ పార్టీని వీడి ఈటల బిజెపిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బిజెపి నాయకులకు టీఆర్ఎస్ గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే హుజురాబాద్ బిజెపి కౌన్సిలర్ ప్రతాప మంజుల టీఆర్ఎస్ లో చేరారు. బిజెపికి చెందిన మరికొందరు కౌన్సిలర్లు కూడా బిజెపి వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు ఈ నెల 31వ తేదీన మాజీ మంత్రి ఈటల రాజేందర్  బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకొన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలతో వరుసగా భేటీ అవుతున్న ఈటల రాజేందర్ కమలం గూటిలో చేరాలని నిర్ణయం తీసేసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మూడు రోజులుగా ఈటల బీజేపీ నేతలతో చర్చలు జరిపుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఈటలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు సానుకూలంగా ఉన్నారు. 

భూకబ్జా ఆరోపణలు రావడంతో కేబినెట్ నుండి ఈటల రాజేందర్ ను కేసీఆర్ తప్పించారు. దీంతో పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలను ఈటల రాజేందర్ ను కలిశారు. గురువారం నాడు ఉదయం టీజేఎస్ చీఫ్ కోదండరామ్, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడ  ఈటల రాజేందర్ తో చర్చించారు. 

read   ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు: ఈ నెల 29న ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక

బీజేపీ జాతీయ నాయకత్వం కూడ ఈటల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కమలదళం  చెబుతుంది. రెండు రోజులుగా ఈటల రాజేందర్ తన అనుచరులతో ఈ విషయమై చర్చించారు. గురువారంనాడు బీజేపీ కేంద్ర నాయకత్వంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల రాజేందర్ పార్టీలో చేరే విషయమై చర్చించారు. పార్టీ కేంద్ర నాయకత్వం కూడ ఈ విషయమై సానుకూలంగా స్పందించింది. ఇదే సమాచారాన్ని  బీజేపీ నాయకత్వం ఈటల రాజేందర్ కు అందించింది.

ఈ నెల 31వ తేదీన  సాధ్యం కాకపోతే జూన్ 1వ తేదీ లేదా రెండో తేదీలలో ఏదో ఒకరోజున ఈటల రాజేందర్ బీజేపీలో చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీలో చేరడానికి ముందే ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇండిపెండెంట్ గా  బరిలోకి దిగాలని బావించినా బీజేపీ మాత్రం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన కమలం పార్టీలో చేరేందుకు మొగ్గు చూపినట్టుగా ఆయన సన్నిహితుల్లో ప్రచారంలో ఉంది. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై పార్టీ నేతలు తనతో చర్చించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios