ప్రచారానికి తెర: బద్వేల్, హుజూరాబాద్‌లలో మూగపోయిన మైకులు

తెలంగాణలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారానికి తెరపడింది.ఈ నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
 

Huzurabad and Badvel bypoll campaign completed


హైదరాబాద్: తెలంగాణలోHuzurabad ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని Badvel అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి బుధవారం సాయంత్రంతో ముగిసింది.  ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న స్థానికేతరులు వెంటనే నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.ఈ నెల 30వ తేదీన బద్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ రెండున ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

also read:Huzurabad Bypoll: మా సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది... ఈటలదే బంపర్ మెజారిటీ: బండి సంజయ్

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో 30 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్ధులు మినహా మిగిలినవారంతా ఇండిపెండెంట్లు.  Bjpఅభ్యర్ధిగా మాజీ మంత్రి Etela Rajender,  Trs అభ్యర్ధిగా Gellu Srinivas Yadav, కాంగ్రెస్ అభ్యర్ధిగాBalmuri Venkat బరిలో నిలిచారు. మిగిలిన వారంతా స్వతంత్రులే. 

ఈ ఉప ఎన్నిక ప్రచారాన్ని బీజేపీ, టీఆర్ఎస్‌లు నాలుగు మాసాల క్రితమే ప్రారంభించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తర్వాత అభ్యర్ధిని ప్రకటించింది. ఆలస్యంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది.ఈ అసెంబ్లీ స్థానం నుండి 2009 నుండి ఈటల రాజేందర్ వరుసగా టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. అయితే ఇటీవల చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ ఈ ఏడాది జూన్ 14న బీజేపీలో చేరారు. అంతకు రెండు రోజుల ముందే ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలుపు బాధ్యతను హరీష్ రావు తన భుజాన వేసుకొన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా తన ఒక్కప్పటి సహచరుడు ఈటల రాజేందర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా పెట్రోల్, డీజీల్,వంట గ్యాస్  ధరల పెంపు అంశాన్ని ప్రధానంగా  హరీష్ రావు ప్రస్తావించారు.

మరో వైపు బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి Kcr లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తనపై విమర్శలు గుప్పించిన మంత్రి హరీష్ రావుపై కూడ ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచార సభల్లో విరుచుకుపడ్డారు. బీజేపీకి చెందిన అగ్రనేతలు కూడ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు.  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి సహా ఆ పార్టీ కీలక నేతలు ఎన్నికల సభల్లో పాల్గొన్నారు.

హుజూరాబాద్  అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,36,283 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,18,720 ఓటర్లున్నారు. 1,17,563 మంది మహిళ ఓటర్లున్నారని ఈసీ ప్రకటించింది.305 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది.

బద్వేల్ బరిలో ప్రధాన పోటీ ముగ్గురి మధ్యే

బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా బీజేపీ, Ycp మధ్యే పోటీ నెలకొంది. ఈ స్థానం నుండి Tdp, Jana sena పోటీ చేయబోమని ప్రకటించాయి. జనసేన నిర్ణయంతో ఈ స్థానంలో బీజేపీ తన అభ్యర్ధిని బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్ధిగా సురేష్ పోటీకి దిగారు.  

also read:పగలు, రాత్రి ఇసుక తోలుకుంటావ్.. నువ్వు కూడా మాట్లాడతావా: శ్రీకాంత్ రెడ్డికి సోము వీర్రాజు కౌంటర్

2019 ఎన్నికల్లో ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన డాక్టర్ Venkata Subbaih అనారోగ్యంతో మరణించాడు. దీంతో వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ Sudha వైసీపీ బరిలోకి దింపింది. Congress పార్టీ ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే కమలమ్మను బరిలోకి దింపింది. ఈ ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్ధులు మినహయిస్తే మిగిలినవారంతా ఇండిపెండెంట్లే.

ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఎన్నికల సభ నిర్వహిస్తే కరోనా కేసులు మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ సూచించడంతో  ఎన్నికల ప్రచారానికి రావడం లేదని జగన్ ప్రకటించారు. ఈ మేరకు బద్వేల్ అసెంబ్లీ ప్రజలకు ఓ లేఖను విడుదల చేశారు. బద్వేల్ నియోజకవర్గంలో మంత్రులు, వైసీపీ కీలక నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్ధి తరపున ఆ పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు. బీజేపీకి చెందిన ఎంపీలు, ఈ నియోజవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios