పగలు, రాత్రి ఇసుక తోలుకుంటావ్.. నువ్వు కూడా మాట్లాడతావా: శ్రీకాంత్ రెడ్డికి సోము వీర్రాజు కౌంటర్
రాయచోటి వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే (rayachoti mla) శ్రీకాంత్ రెడ్డిపై (srikanth reddy) మండిపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుక తోలుకునే శ్రీకాంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉపఎన్నికల కోసం కేంద్ర బలగాలు రావడంతో ఓర్చుకోలేకపోతున్న మీరు నోటికొచ్చినట్టు విమర్శిస్తే ఓట్లు రాలవంటు వీర్రాజు దుయ్యబట్టారు.
రాయచోటి వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే (rayachoti mla) శ్రీకాంత్ రెడ్డిపై (srikanth reddy) మండిపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుక తోలుకునే శ్రీకాంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉపఎన్నికల కోసం కేంద్ర బలగాలు రావడంతో ఓర్చుకోలేకపోతున్న మీరు నోటికొచ్చినట్టు విమర్శిస్తే ఓట్లు రాలవంటు వీర్రాజు దుయ్యబట్టారు.
అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారని.... బద్వేలులో ఉన్న నీరు, రోడ్లు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తదితర అనేక సమస్యలను తాము పరిష్కరిస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు. మీరు కబ్జాచేసి అక్రమంగా ఆక్రమించుకున్న భూములను తిరిగి హక్కుదారులకు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కొంత కూడా అభివృద్ధి చేయని మీకు అసలు ఓట్లు అడిగే హక్కుందా? అని ప్రశ్నించారు. మీరు అభివృద్ధి చేసినట్టు భావిస్తే తమ అభ్యర్థితో చర్చకు రావాలని సోము వీర్రాజు సవాల్ విసిరారు. వైసీపీ పతనం బద్వేల్ తోనే ప్రారంభమవుతుందని... ఇది సత్యమని ఆయన జోస్యం చెప్పారు.
ALso Read:Badvel Bypoll: బిజెపితో పవన్ కల్యాణ్ విభేదాలు
కాగా.. వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (venkata subbaiah) ఆకస్మిక మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక (badvel bypoll) అనివార్యమైన సంగతి తెలిసిందే. కోవిడ్‌తో వాయిదా పడిన ఎన్నికలను అక్టోబర్‌లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (election commission) షెడ్యూలు విడుదల చేసింది. అయితే, దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణికే వైసీపీ టికెట్ ఇచ్చినందున జనసేన (janasena) పోటీ చేయడం లేదని ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (pawan kalyan) ప్రకటించారు. పవన్ పోటీకి దూరమని ప్రకటించిన కొద్ది గంటల్లోనే టీడీపీ (tdp) సైతం విరమించుకుంటున్నట్లు వెల్లడించింది. గత సంప్రదాయాలను గౌరవిస్తూ తాము బద్వేల్ ఉపఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.
అయితే, బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. ఈ మేరకు పనతల సురేశ్‌ను అభ్యర్ధిగా వెల్లడించింది. మిత్రపక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనకు భిన్నంగా ఏపీ బీజేపీ (bjp) అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) సీరియస్ కామెంట్స్ చేశారు. బద్వేల్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు.