హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఏకపక్షంగా తెరాస విజయం సాధించింది. రికార్డులను తిరగరాస్తూ తెరాస అభ్యర్థి శానంపూడి సైది రెడ్డి 20 సంవత్సరాల కంచుకోటాను బద్దలు కొట్టాడు. తొలి రౌండ్ నుంచి తిరుగులోలేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ అంతకంతకు తన మెజారిటీని పెంచుకుంటూ పోయాడు. ఏ రౌండ్ లోను కాంగ్రెస్ లీడ్ సాధించలేకపోయిందంటే అర్థం చేసుకోండి ఎంత ఏకపక్షంగా విజయం ఉందొ. 

కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకోవాలిసి వచ్చింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. మూడో స్థానంలో ఎవరు నిలిచారో తెలిస్తే అందరూ షాక్ కు గురవుతారు. టీడీపీ,బీజేపీలను వెనక్కు నెడుతూ సపావట్ సుమన్ అనే వ్యక్తి మూడో స్థానంలో నిలిచాడు. చపాతీ రోలరు గుర్తుపై పోటీ చేసిన సుమన్ అందరిని విస్మయానికి గురిచేస్తూ మూడో స్థానంలో నిలిచాడు. 

సపావట్ సుమన్ మంచ్యా తండా గ్రామానికి చెందిన వ్యక్తి. గుర్తు చపాతీ రోలరు. 33 సంవత్సరాల వయసున్న ఇతను ఒక సోషల్ వర్కర్ అని తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇతను నాగార్జున యూనివర్సిటీ నుండి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తన అఫిడవిట్ లో ఎన్నికల కమిషన్ కు ట్రాక్టర్, లేదా రోడ్డు రోలరు లేదా టెంట్ గుర్తు కేటాయించమని  అభ్యర్థించాడు.  హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇతను అంత పాపులర్ కూడా కాదు. బరిలో ఇతనున్నదని ఓటర్లలో చాలామందికి అసలు తెలియదు కూడా. 

మరి ఇలాంటి వ్యక్తి ఎలా మూడో స్థానంలో నిలిచాడు? అందునా బీజేపీ,టీడీపీలాంటి పార్టీలను తోసిరాజేస్తూ ఎలా ముందుకెళ్లాడు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఒక సారి ఈవీఎం యూనిట్లలో వారి నంబర్లను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తెరాస అభ్యర్థి సీరియల్ నెంబర్ 4. రూల్స్ ప్రకారం మొదటి ఈవీఎం లో నాలుగో స్థానంలో సైది రెడ్డి పేరు ఉండాలి.మొత్తంగా కలిపి 3 ఈవీఎంలను హుజూర్ నగర్ ఉప ఎన్నికకు ఉపయోగించారు. 

అధికారులు పొరపాటున కొన్ని పోలింగ్ బూతుల్లో మొదటి ఈవీఎం కు బదులు వేరే ఈవీఎం ను ముందు ఉంచారు. ఆ పొరపాటున ముందు ఉంచిన ఈవీఎంలో హెల్మెట్ గుర్తుపై పోటీ చేసిన సుమన్ ది నాలుగో పేరు. కొద్దిసేపు అయోమయానికి గురై ప్రజలు నాలుగో నెంబర్ సైది రెడ్డిది అని భావించి ఓట్లు వేశారు. కొద్ధి సేపటి తరువాత ఒక ఓటర్ దాన్ని గుర్తించి అధికారులకు తెలియజేయడంతో దాన్ని మార్చారు. ఇలా మార్చక ముందు వరకు కాఫుసిన్ లో కొన్ని ఓట్లు హెల్మెట్ గుర్తుపై పోలయ్యాయి. 

ఇది సుమన్ మూడో స్థానం వెనుక ఉన్న 'సుమనో'హర స్టోరీ. పొరపాటున మిస్ అయిన తెరాస స్థాయిలో కూడా బీజేపీ టీడీపీలు సాధించకపోవడం గమనార్హం.  

హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి ఘన విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి రెడ్డి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక బీజేపీ, టీడీపీ అభ్యర్ధులకు డిపాజిట్ కూడ దక్కలేదు.

 హుజూర్‌నగర్ అసెంబ్లీ స్తానంలో  టీఆర్ఎస్‌ అభ్యర్ధి సైదిరెడ్డికి 1,12,796 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డికి   69,563 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధి కోట రామారావు, టీడీపీ  అభ్యర్ధి చావా కిరణ్మయికి 1827 ఓట్లు వచ్చాయి.

 ఇక కాంగ్రెస్ పార్టీ తర్వాత మూడో స్థానంలో సుమన్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి 2693 ఓట్లు వచ్చాయి. సుమన్ కంటే టీడీపీ, బీజేపీ అభ్యర్ధులకు తక్కువ ఓట్లు వచ్చాయి. 

read more  Huzurnagar Election Result: 20 ఏళ్ల ఉత్తమ్ కోట బద్దలు, ఒక్కసారి చూద్దామని సైదిరెడ్డికి...

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  మొదటి రౌండ్ నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి ఆధిక్యతను కనబరుస్తున్నాడు. తొలి రౌండ్‌ నుండి సైదిరెడ్డి ఆధిక్యత పెరుగుతూనే వచ్చింది. టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ఏ రౌండ్‌లో కూడ కాంగ్రెస్ అడ్డుకోలేకపోయింది.

గురువారం నాడు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఓట్లను లెక్కించారు.సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 

మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించేందుకు గాను 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ పది నిమిషాలకు ఒక్క రౌండ్ ఫలితం వచ్చింది. ఈ నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 751. మండలానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపట్టారు.

read more  #Huzurnagar result: రికార్డు బద్దలు కొట్టిన సైదిరెడ్డి

ఇక హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ  అభ్యర్ధులకు డిపాజిట్లు కూడ దక్కలేదు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 1515 ఓట్లు వచ్చాయి.ఈ ఎన్నికల్లో నోటా కంటే బీజేపీ అభ్యర్ధి 1515 ఓట్లు వచ్చాయి. 

ఈ దఫా బీజేపీ అభ్యర్ధి కోట రామారావుకు గతంలో కంటె ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 2621 ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్ధి చావా కిరణ్మయికి 1827 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో 25,395 ఓట్లు టీడీపీ అభ్యర్ధి వంగాల స్వామిగౌడ్ కు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ  ఈ స్థానంలో పోటీ చేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది.