హైదరాబాద్: హైద్రాబాద్ దిల్‌సుఖ్ నగర్ లో విషాదం చోటు చేసుకొంది. సాహితీ అపార్ట్‌మెంట్ లో సెల్లార్ లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది.

భారీ వర్షాల కారణంగా  సెల్లార్ లోకి వర్షం నీరు చేరింది. దీంతో  ఈ వర్షం నీటిలో బాలుడు పడి మృతి చెందాడు.సెల్లార్ లో వర్షం నీటిలో ప్రమాదవశాత్తు బాలుడు పడి  మరణించాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

also read:భారీ వర్షాలు: హైద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

భారీ వర్షం కారణంగా వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరింది. పలు అపార్ట్ మెంట్లు, ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. పొరపాటున ఈ నీళ్లలో పడిపోయిన బాలుడు మృతి చెందాడు.

మరో వైపు హైద్రాబాద్ బంజారాహిల్స్ లో విషాద ఘటన చోటు చేసుకొంది. వర్షం కారణంగా యోగా క్లినిక్ లో వర్షం నీరు చేరింది. దీంతో నీటిని తోడేందుకు మోటార్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో డాక్టర్ సతీష్ రెడ్డి మరణించాడు. దీంతో ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి.

గత 24 గంటలుగా  హైద్రాబాద్ లో భారీ వర్షం కురిసింది.ఈ వర్షాల కారణంగా హైద్రాబాద్ నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీలు నీట మునిగిపోయాయి.నగరంలో  మరో రెెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.