Asianet News TeluguAsianet News Telugu

ప్రియురాలితో భ‌ర్త‌.. ఎంత చెప్పినా విన‌కపోవ‌డంతో చివ‌రికి భార్య‌...

భర్త వేరే మహిళతో వివాహేత సంబంధం కొనసాగిస్తున్నాడని మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో గురువారం జరిగింది. 

Husband with girlfriend .. finally wife...
Author
Janagama, First Published Dec 10, 2021, 1:43 PM IST

వారిద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు. ఒక కూతురు, ఒక కుమారుడు. అంత సవ్యంగానే సాగిపోతోంది. కానీ భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో కొంత కాలంగా మార్పు క‌నిపించింది. భ‌ర్త వేరే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధంలో ఉన్నార‌ని భార్య గుర్తించింది. వివాహేత సంబంధం మానుకోవాల‌ని భ‌ర్త‌కు చెప్పి చూసింది. అయినా అత‌డిలో మార్పు రాలేదు. ఈ విష‌యంలో భ‌ర్త‌తో త‌ర‌చూ గొడ‌వ ప‌డుతుండేది. అయినా కూడా భ‌ర్త మార‌క‌పోవ‌డంతో మాన‌స్తాపానికి గురైన భార్య ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న తెలంగాణలోని జ‌న‌గామ జిల్లా ర‌ఘునాథప‌ల్లి మండ‌ల ప‌రిధిలో గురువారం జ‌రిగింది. 

తెలంగాణాలో పెరిగిన ఆత్మహత్యలు.. NCRB నివేదికలో షాకింగ్ విష‌యాలు !

ఏడాది కాలంగా సంబంధం..
జ‌న‌గామ జిల్లాలోని ర‌ఘునాథప‌ల్లి మండ‌లం ప‌రిధిలో ఉన్న రామ‌న్న‌గూడెంకు చెందిన న‌ర్సిరెడ్డి - సునీత (38) దంప‌తులు. వీరు వ్య‌వ‌సాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఒక కూత‌రు, ఒక కుమారుడు. అయితే న‌ర్సిరెడ్డి ఓ ఏడాది కాలంగా ఓ మహిళ‌తో చ‌నువుగా ఉండ‌టాన్ని సునీత గుర్తించింది. వివాహేతర సంబంధాన్ని మానుకోవాల‌ని సునీత త‌రచూ న‌ర్సిరెడ్డితో గొడ‌వప‌డుతూ ఉండేది. ఎన్ని సార్లు చెప్పినా.. భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాక‌పోవ‌డంతో భార్య మ‌న‌స్తాపానికి గురైంది. దీంతో ఉరి వేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. భ‌ర్త వ్య‌వ‌సాయ ప‌నుల నిమిత్తం పొలం వ‌ద్ద‌కు గురువారం ఉద‌యం వెళ్లాడు. సాయంత్రం తిరిగి వ‌చ్చేస‌రికి సునీత దూలానికి ఉరివేసుకొని క‌నిపించింది. దీంతో న‌ర్సిరెడ్డి తీవ్రంగా రోదించాడు. స్థానికులు గ‌మ‌నించి అక్క‌డికి చేరుకున్నారు. వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.  సునీత బంధువులు ఘ‌ట‌నా స్థ‌లంలో ఆందోళ‌న నిర్వ‌హించారు. వేరే మ‌హిళ‌ల‌తో సంబంధానికి సునీత అడ్డుగా ఉంద‌ని త‌మ కూతురు అడ్డంగా ఉంద‌నే చంపేశార‌ని సునీత త‌ల్లిదండ్రులు ఆరోపించారు. తీవ్ర ఆవేశంలో ఉన్న బంధువులు అక్క‌డున్న వ‌స్తువుల‌ను ధ్వంసం చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ పోలీసులు వారిని స‌ముదాయించారు. చ‌ట్ట‌ప్ర‌కారం బాధితుల‌కు న్యాయం చేస్తామ‌ని ఎస్సై రాజేష్ నాయ‌క్ హామీ ఇవ్వ‌డంతో బంధువులు ఆందోళ‌న విర‌మించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios