కట్టుకున్న భార్య... మరో వ్యక్తితో ఛాటింగ్ చేస్తుందని అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతోనే భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన గోదావరిఖని లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  గాంధీనగర్ కి చెందిన దుర్గం మౌనిక, మౌనిక, శ్రావణ్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. భార్యను డిగ్రీ చదివించిన శ్రావణ్‌ ఇటీవల లాసెట్‌ పరీక్ష కూడా రాయించాడు. అయితే ఎలాంటి పనిచేయని శ్రావణ్‌ తండ్రి వారసత్వ ఉద్యోగం(సింగరేణి) కోసం ఎదురు చూస్తున్నాడు.

 ఈ మధ్య కాలంలో భార్యపై శ్రావణ్‌ అనుమానం పెంచుకున్నాడు. మొబైల్‌లో మరో వ్యక్తితో చాటింగ్‌ చేస్తోందని భార్యతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే భార్యను  శ్రావణ్‌ అతి కిరాతకంగా  హత్య చేశాడు. ఇనుపరాడ్డుతో భార్య తలపై మోదీ హత్య చేశాడు.  అనంతరం నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.