Asianet News TeluguAsianet News Telugu

భార్యను వేధిస్తున్నాడని తమ్ముడిపై అనుమానం, అర్ధరాత్రి నరికి చంపిన అన్న

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. భార్యను వేధిస్తున్నాడని తమ్ముడిని అన్న నరికి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులకే స్వయంగా సమాచారం ఇచ్చాడు.
 

husband kills brother suspected affair with wife in hyderabad kms
Author
First Published Oct 5, 2023, 1:00 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక అనుమానం ఇద్దరు అన్నదమ్ముల మధ్య దూరం పెంచింది. తన భార్యను తమ్ముడు వేధిస్తున్నాడనే అనుమానం అన్న మెదడులో సుడులు తిరిగింది. చివరకు ఆ అనుమానంతోనే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తమ్ముడిని అన్న నరికి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ ఫిలిం నగర్‌లోని బసవతారక నగర్‌లో జరిగింది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2 గంటలకు తమ్ముడు సాజిద్‌ను అన్న షబ్బీర అహ్మద్ దారుణంగా నరికేశాడు. సాజిద్‌ను చంపేసిన తర్వాత షబ్బీర్ అహ్మద్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: లిప్ట్ లోనే కొట్టిచంపి... కారులో పడేసి యాక్సిడెంట్ నాటకం... సినీనిర్మాత హత్యకేసులో సంచలన నిజాలు

పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలను సేకరించారు. సాజిద్ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు పంపించారు. నిందితుడు షబ్బీర్ అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios