ఆర్మూరులో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్యనే తెలివిగా చంపేందుకు పక్కా ప్లాన్ వేశాడు. ఆమెకున్న స్కిన్ ఎలర్జీని ఆసరాగా తీసుకుని.. ఆ మందులని చెప్పి స్టెరాయిడ్స్ ఇచ్చాడు. భర్త ఆర్ఎంపీ కావడంతో గుడ్డిగా నమ్మి ఆ మందులు వేసుకున్న భార్య.. చివరికి అనుమానం రావడంతో..
నిజామాబాద్ : Armur లో భార్యను వదిలించుకోడానికి ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. గంగాసాగర్, స్రవంతి దంపతులు. ఆర్మూర్ లో నివాసం ఉంటున్నారు. స్రవంతికి Skin allergy ఉంది. దీనికి ట్రీట్మెంట్ అని చెప్పి స్రవంతికి గంగాసాగర్ steroids ఇచ్చాడు. అవి తీసుకున్న తరువాత నీరసించి పోవడం, ఒంట్లో ఏదో మార్పులు వస్తుండడంతో స్రవంతికి అనుమానం వచ్చి ఆసుపత్రిలో చూపించుకోగా అసలు విషయం బయటపడింది.
స్రవంతి, గంగా సాగర్ లకు 2017లో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. గంగాసాగర్ ఆర్మూర్ లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో Compounder గా పని చేస్తూనే RMPగా క్లినిక్ పెట్టుకున్నాడు. దీంతో సొంతవైద్యం చేశాడు. 25 ఏళ్ల స్రవంతికి స్కిన్ ఎలర్జీ ఉంది. దీన్ని ఆసరాగా ఆమె అడ్డుతొలగించుకోవాలనుకుని స్టెరాయిడ్స్ ఇవ్వడంతో.. పాతికేళ్లకే స్రవంతి నరాల బలహీనతకు గురైంది. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా... పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం చేయాలంటూ బాధితులు కలెక్టరేట్ కు వచ్చారు.
ఇక ముంబైలో ఓ విషాద ఘటన ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఓ 89 ఏళ్ల ex-Army man తన భార్య, కూతురిని గొంతుకోసి అంత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఈ ఘట ఆదివారం సాయంత్రం తూర్పు అంధేరిలోని వారి ఫ్లాట్‌లో జరిగింది. సోమవారం ఉదయం సదరు వృద్ధుడు.. 81 ఏళ్ల భార్య, 55 ఏళ్ల మానసిక వికలాంగురాలైన కూతురి బాధలను చూడలేక వారి గొంతుకోసిచంపేశానని చెబుతూ మేఘ్‌వాడి పోలీసుల ముందు లొంగిపోయాడు.
నిందితుడిని పురుషోత్తం సింగ్ గంధోక్ గా గుర్తించారు. తన భార్య, కుమార్తెలను పదేళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటున్నానని.. వీరిద్దరూ bed ridden అయ్యారని.. పదేళ్లుగా వారిని చూసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చాడు. ఇక మీదట వారు బాధపడటం తనకు ఇష్టం లేదని పోలీసులకు చెప్పాడు.
హత్యల సమాచారం తెలిసి పోలీసులు సోమవారం ఉదయం.. అంధేరీలోని షేర్-ఏ-పంజాబ్ కాలనీలోని ప్రేమ్ సందేశ్ సొసైటీలోని అతని ఫ్లాట్‌లోకి ప్రవేశించేసరికి.. అక్కడ గంధోక్ చాలా ప్రశాంతంగా కనిపించాడని పోలీసులు తెలిపారు. వారు లోపలికి వెళ్లి చూడగా.. బెడ్‌రూమ్‌లో రక్తంతో తడిసిన మంచాలపై కుమార్తె , భార్య మృతదేహాలు కనిపించాయి.
ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన భార్య జస్బీర్ కౌర్, కుమార్తె కమల్‌జిత్ కౌర్‌లను హత్య చేశాడు. ఆ తరువాత 12 గంటలు గడిచాక.. అంటే సోమవారం ఉదయం 8.40 గంటలకు తన పెద్ద కుమార్తె గుర్బిందర్ కౌర్ (58)కి గంధోక్ కాల్ చేసి తను చేసిన పనిని ఆమెకు చెప్పాడు.
"గంధోక్ మాజీ సైనికుడు. ఆర్మీలో చేసి రిటైర్ అయ్యాడు. వంటగదిలో ఉపయోగించే కత్తితో తన భార్య, కుమార్తెల గొంతు కోశాడు. దీనికి అతనేం బాధపడడం లేదు. వారి రోజువారీ అవసరాలు చూసుకోలేక, వారి బాధ చూడలేకే ఈ ఈ నేరానికి పాల్పడ్డానని పోలీసులకు తెలిపాడు’’ అని డీసీపీ(జోన్ X) మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
