భర్త ఇంటిముందు ఓ భార్య బైఠాయించింది. కూతురు పుట్టిందన్న కారణంతో ఏడేళ్లుగా ఇంట్లోకి రానివ్వలేదని ఆరోపించారు.
హైదరాబాద్ : హైదరాబాద్ అంబర్ పేట్ ఆర్ కె. నగర్ లో భర్త ఇంటి ముందు కూతురితో కలిసి బాధితురాలు మాధవి బైఠాయించింది. బాధితురాలు మూడు రోజులుగా భర్త ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. ఏడేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాని మాధవి చెప్పంది.
ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త కిరణ్ కుమార్, అత్త, మామలు ఇంటి నుండి గెంటేసింది. దీంతో గత మూడు రోజులుగా భర్త ఇంటి ముందు నిరసన తెలిపింది. అయితే, ఈ విషయాన్ని భర్త, అత్త, మామలు పట్టించుకోలేదు. తనను.. కూతురిని ఇంట్లోకి అనుమతించే వరకు అక్కడే ఉంటానని..కూతురితో కలిసి బైఠాయించింది. బాధితురాలు మాధవి.. తనకు తన కూతురికి న్యాయం చేయాలని కోరుతుంది.
Victim Madhavi - 9014999310
