భార్య తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిందన్న మనస్థాపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్యను విడిచివుంటూ ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.  

కడప జిల్లాకు చెందిన చరణ్ రెడ్డి అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం హైదరబాద్ కు వచ్చాడు. భార్యతో కలిసి పేట్ బషీరాబాద్ వాజపేయీ నగర్ లో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసముండేవాడు. 

ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇలా నిత్యం గొడవలతో విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుండి ఒంటరిగా వుంటున్న చరణ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. భార్య ఇక తిరిగి రాదేమోనన్న మనస్థాపంతో అద్దెకుంటున్న ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు వదిలాడు. 
 
ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.