Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ నాగోల్‌లో దారుణం: భార్యను హత్య చేసి భర్త సూసైడ్

హైద్రాబాద్ నగరంలోని నాగోల్ లో  భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Husband commits Suicide after  killed  Wife in Hyderabad lns
Author
First Published Oct 17, 2023, 9:34 AM IST

హైదరాబాద్: నగరంలోని నాగోల్ లో  మంగళవారంనాడు దారుణం చోటు చేసుకుంది.  భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ ఘటనపై  పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నగరంలోని నాగోల్ సాయినగర్ లో నివాసం ఉంటున్న  రాములు  తన భార్య సంతోషిని  హత్య చేశాడు.  ఆ తర్వాత  సరూర్ నగర్ తపోవన్ కాలనీలో గల బంధువుల ఇంటికి వెళ్లారు. బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహలతోనే  భార్యను  రాములు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సరూర్ నగర్ తపోవన్ కాలనీలో ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో  కూడ ఇదే తరహా ఘటనలు  చోటు చేసుకున్నాయి.ఈ నెల  9వ తేదీన  హైద్రాబాద్ వనస్థలిపురంలో   భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు.  వనస్థలిపురం  అంజనపురి కాలనీలో నివాసం ఉంటున్న   బాలకోటయ్య  తన భార్య శాలినిని  హత్య చేశాడు.  తన భార్య  మరొకరితో  సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో హత్య చేశాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే తరహా ఘటన ఒకటి చోటు చేసుకుంది.  ఈ నెల  5న కడప కోఆపరేటివ్ కాలనీలో  భార్యతో పాటు ఇద్దరు పిల్లలను  కానిస్టేబుల్   వెంకటేశ్వర్లు హత్య చేశాడు. ఆ తర్వాత  తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో  భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు భర్త. ఈ ఘటన ఈ నెల  1న చోటు చేసుకుంది.  యూపీ రాష్ట్రంలో బందా జిల్లాలో  ఈ ఘటన  వెలుగు చూసింది.  

ఈ ఏడాది సెప్టెంబర్ 12న ఢిల్లీలోని  జఫ్రాబాద్ లో  భార్యపై అనుమానంతో భర్త దారుణంగా హత్య చేశాడు. సాజిద్ అనే వ్యక్తి మొబైల్ రిపేర్ దుకాణం నిర్వహించేవాడు.  ఈ దుకాణాన్ని  ఆయన మూసివేశాడు. కొంత కాలంగా  భార్య నిషాపై  ఆయన అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై భార్యతో  గొడవ పెట్టుకున్నాడు. కోపంతో  ఆమెను చంపాడు.


 ఆత్మహత్య చేసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదు

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

Follow Us:
Download App:
  • android
  • ios