Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం : భార్యతో ఎస్సై ఎఫైర్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన భర్త ...

ఈ నెల 18న మహిళలు కలిసేందుకు షఫీ ఆమె ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో భార్యతో ఉన్న ఎస్సైని మహిళ భర్త, అతని మిత్రులు కలిసి  పట్టుకుని చితకబాదారు. ఎస్ఐ ఎంత ప్రాధేయపడినా ఆగకుండా కొట్టారు.  అడ్డు వచ్చిన భార్యను కూడా చెంప చెల్లుమనిపించారు. 

husband caught his wife red handed with SI at wanaparthy
Author
Hyderabad, First Published Nov 26, 2021, 2:54 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వనపర్తి :  తన భార్యతో Extramarital affair కొనసాగిస్తున్న ఓ ఎస్ ఐని ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాదాడు. ఈ ఘటన జిల్లాలోని కొత్తకోటలో వెలుగుచూసింది. మహిళ husband, అతని friends కలిసి ఎస్సైను చితకబాదిన వీడియో ఇప్పుడు Social mediaలో వైరల్ గా మారింది. 

వివరాల్లోకి వెళితే... కొత్తకోట కు చెందిన ఓ మహిళతో వనపర్తి రూరల్ ఎస్సై షేక్ షఫీ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో ఇద్దరినీ Red Handed గా పట్టుకునేందుకు అవకాశం కోసం వేచి చూస్తున్నాడు.

 కాగా ఈ నెల 18న మహిళలు కలిసేందుకు షఫీ ఆమె ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో భార్యతో ఉన్న ఎస్సైని మహిళ భర్త, అతని మిత్రులు కలిసి  పట్టుకుని చితకబాదారు. ఎస్ఐ ఎంత ప్రాధేయపడినా ఆగకుండా కొట్టారు.  అడ్డు వచ్చిన భార్యను కూడా చెంప చెల్లుమనిపించారు. 

విషయం తెలుసుకున్నPolice సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఎస్సైని  వనపర్తి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అలాగే సదరు ఎస్సైని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
అయితే గౌరవప్రదమైన వృత్తిలో ఉండి  ఇలా నీచ బుద్ధి చూపించిన ఎస్సై Sheikh Shafiపై  పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, పోలీస్ అధికారితో అక్రమ సంబంధం కలిగివున్న వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన గురువారం నవంబర్ 24న కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగళూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియురాలి మృతి తర్వాత సదరు పోలీస్ విధులకు హాజరుకాకుండా పరారీలో వుండటం మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. 

వివరాల్లోకి వెళితే... చిక్కమంగళూరు జిల్లా సిడ్లఘట్ట పట్టణంలోని మారమ్మ దేవాలయం సర్కిల్ లో రాజేశ్వరి(35)-వెంకటేష్(38) దంపతులు ఇద్దరు ఆడపిల్లలతో కలిసి నివాసముండేవారు. అయితే అదే కాలనీలో నివాసముండే 
Traffic Head Constable అనంత్ కుమార్ కన్ను రాజేశ్వరిపై పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇలా గత నాలుగేళ్లుగా ఆమెతో extramarital affair కొనసాగిస్తున్నాడు.

చాక్లెట్ ఆశ చూపి.. 13యేళ్ల బాలుడిపై యువకుడి అత్యాచారం...

అయితే ఇటీవల రాజేశ్వరితో అనంత్ కుమార్ గొడవపడ్డట్లు సమాచారం. ఈ గొడవ తర్వాత వివాహిత అనుమానాస్పద రీతితో ప్రాణాలో కోల్పోయింది. మంగళవారం ఉరి వేసుకున్న స్థితితో రాజేశ్వరి మృతదేహాన్ని భర్త వెంకటేష్ గుర్తించాడు. ఈ ఘటన తర్వాత అనంత్ కుమార్ పరారీలో వుండటం రాజేశ్వరి మృతిపై అనుమానం కలుగుతోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని కిందకుదించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే తన భార్య రాజేశ్వరిని అనంత్ కుమార్ హత్య చేసాడని భర్త వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న హెడ్ కానిస్టేబుల్ కోసం గాలింపు చేపట్టారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే వివాహిత మృతిపై క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు.

అయితే బాధిత కుటుంబానికి స్థానికులు అండగా నిలిచారు. వివాహితతో అక్రమసంబంధం పెట్టుకుని... ఇప్పుడు ఆమె మృతికి కారణమైన హెడ్ కానిస్టేబుల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తల్లిని కోల్పోయిన ఇద్దరు ఆడపిల్లలతో కూడిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios