Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ అధికారుల అక్రమ సంబంధం బట్టబయలు

  • ఎసిబిలో అడిషనల్ ఎస్పీ సునితారెడ్డి అక్రమ సంబంధం గుట్టు రట్టు
  • తన కింద పనిచేసే సిఐ మల్లిఖార్జునరెడ్డితో ఆమె అక్రమ సంబంధం
  • అమెరికా నుంచి వచ్చి బట్టబయలు చేసిన సునితారెడ్డి భర్త
  • సిఐ మల్లిఖార్జున్ రెడ్డిని చెప్పులతో తరిమికొట్టిన సునితారెడ్డి తల్లి, అత్త, భర్త
  • ఈ ఇద్దరే రేవంత్ ఓటుకు నోటు కేసు డీల్ చేసిన అధికారులు
Husband catches acb officer wife and paramour redhanded

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అత్యంత సంచలనం సృష్టించిన సంఘటన ఏదైనా ఉందంటే అది ఓటుకు నోటు కేసు. ఆ కేసులో అప్పటి టిడిపి నేత, ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఈ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తర్వాత ఆయన జైలుకు వెళ్లాడు. ఈ కేసులో మరో భారీ సంచలనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పోలీసు అధికారులు అక్రమ సబంధం ఏర్పడడానికి ఈ ఓటుకు నోటు కేసు కారణభూతమైంది. ఆ వివరాలేంటో కింద చదవండి.

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలంగాణ సర్కారు ట్రాప్ చేసి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని పట్టుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో అవినీతి నిరోధక శాఖ డిఎస్సీగా ఉన్న సునీతారెడ్డి ఈ కేసును డీల్ చేశారు. సునీతారెడ్డి టీం లో సిఐ మల్లిఖార్జున్ రెడ్డి కూడా ఒకరు. అయితే ఓటుకు నోటు కేసు తాలూకు ఆపరేషన్ విజయవంతం చేసిన ఈ ఇద్దరు పోలీసు అధికారులు రానున్న కాలంలో సన్నిహితులయ్యారు. పై అధికారి సునితారెడ్డి చనువు ఇచ్చింది. తన కింద పనిచేసే కింది అధికారి మల్లిఖార్జున్ రెడ్డి రెచ్చిపోయాడు. ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఓటుకు నోటు కేసే వీరిద్దరి అక్రమ సంబంధానికి కారణమైందని పోలీసు వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

ఓటుకు నోటుతో పాటు తెలంగాణలో అనేక సంచలన కేసులను సునీతారెడ్డి డీల్ చేశారు. అనేక మంది అవినీతిపరులను బజారుకు ఈడ్చారు. కానీ అక్రమ సంబంధం కేసులో ఆమె బజారున పడే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇక సిఐ మల్లిఖార్జున్ రెడ్డితో అక్రమ సంబంధం గుట్టు ఎలా రట్టయిందో కింద చదవండి.

Husband catches acb officer wife and paramour redhanded

ఓటుకు నోటు కేసు నడుస్తున్న క్రమంలోనే సునితారెడ్డికి డిఎస్పి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయికి ప్రమోషన్ లభించింది. సునితారెడ్డి 2007 లో గ్రూప్ అధికారిగా ఎంపికై డిఎస్పీగా డ్యూటీ లో చేరారు. తాజాగా అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొందిన సునీతారెడ్డే ఓటుకు నోటు కేసు ఇప్పటికీ డీల్ చేస్తున్నారు. అయితే ఈ కేసు తర్వాత తన కింద పనిచేసే మల్లిఖార్జున్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం సునీతారెడ్డి కుటంబసభ్యలకు తెలిసింది. అమెరికాలో ఉండే సునితారెడ్డి భర్త ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. దీంతో ఏడెనిమిది నెలల క్రితం ఉన్నతాధికారులు ఈ అక్రమ సంబంధం విషయంలో స్పందించి సిఐ మల్లిఖార్జున్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి అతడిని కల్వకుర్తి సిఐ గా బదిలీ చేశారు. దీంతో అతడు అక్కడ విధుల్లో చేరాడు.

Husband catches acb officer wife and paramour redhanded

కానీ అంతా సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో గత కొంతకాలంగా మళ్లీ సునితారెడ్డికి మల్లిఖార్జున్ రెడ్డి టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు. తరచుగా సునితారెడ్డి ఇంటికి వస్తూ పోతూ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో సునితారెడ్డి అత్త జరుగుతున్న తతంతాన్ని అమెరికాలో ఉన్న కొడుకుకు వివరించారు. అయితే గత రెండు రోజుల క్రితం భార్య సునితారెడ్డికి చెప్పకుండానే అమెరికా నుంచి దిగిన ఆయన సునితారెడ్డి ఇంటికి ఆదివారం రాత్రిపూట వచ్చిన మల్లిఖార్జున్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో మల్లిఖార్జున్ రెడ్డిని సునితారెడ్డి భర్త, ఆయన తల్లి, సునితారెడ్డి తల్లి ముగ్గురూ కలిసి చెప్పులు తీసుకుని తరిమి తరిమి కొట్టారు.

అతడి మీద మోజు ఉంటే విడాకులివ్వు : భర్త

సునితారెడ్డికి అతని మీద మోజు ఉంటే తనకు విడాకులు ఇచ్చి అతడితో ఉండొచ్చని ఆమె భర్త చెబుతున్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే పద్ధతి ఉంది కదా అని ఆయన ఒక మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గతంలోనే తమకు అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని... తాము ఇంకా ఆ సబంధం కట్ చేసుకున్నామని చెప్పారని ఆయన అన్నారు. కానీ గత కొంతకాలంగా మళ్లీ అదే కంటిన్యూ చేస్తున్నట్లు ఆరోపించారు. వీరి వ్యవహారం కారణంగా తాను ఆత్మహత్యాయత్నం చేయాలనిపించిందన్నారు. తనను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు సునితారెడ్డి తల్లి, అత్త కూడా మల్లిఖార్జున్ రెడ్డిని చెప్పులతో కొట్టడమే కాకుండా తీవ్రమైన విమర్శలు చేశారు. మల్లిఖార్జున్ రెడ్డి మా అమ్మాయిని లోబర్చుకుని నాశనం చేశాడని, మా కుటుంబంలో చిచ్చు పెట్టాడని ఆరోపించారు.

ఈ విషయంలో అడిషనల్ ఎస్పీ సునితారెడ్డి, సిఐ మల్లిఖార్జున్ రెడ్డి వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వీరిద్దరి తీరుపై ఏం నిర్ణయం తీసుకోవాలన్నదానిపై చర్చిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios