ఓ భర్తను అనుమానం భూతం పట్టుకుంది. అది భార్య పాలిట శాపంగా మారింది. కట్టెలు తెద్దామని అడవిలోకి తీసుకువెళ్లి.. కాళ్లు, చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి చంపేశాడు. 

మణుగూరు : ఓ భర్తకు భార్య మీద ఉన్న Suspicion పెనుభూతం అయ్యింది. ఆమె పాలిట కాలయముడిగా మారాడు. కాళ్ళు, చేతులు కట్టేసి.. కారం పొడి చల్లి wifeను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం శాంతినగర్ గ్రామంలో ఈనెల 11న సుచరిత (27) అనే వివాహిత హత్యకు గురయ్యింది. అప్పటినుంచి ఆమె Murder Mysteryని పోలీసులు చేధించే పనిలో పడ్డారు. అయితే భార్యను భర్త చంద్రశేఖర్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భద్రాద్రి జిల్లా మణుగూరు పోలీసు స్టేషన్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను ఇంచార్జ్ డి.ఎస్.పి వెంకటేశ్వరబాబు వెల్లడించారు. 

శాంతి నగర్ కు చెందిన గండమల్ల చంద్రశేఖర్ కి ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన సుచరితతో 12యేళ్ల కిందట వివాహమయ్యింది. దంపతులకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. చంద్రశేఖర్ కూలి పనులు చేస్తూ ఉంటాడు. అయితే, ఎలా మొదలయ్యిందో తెలియదు.. కానీ చంద్రశేఖర్ గత కొంతకాలంగా తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెను హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాడు గత శనివారం వంటచెరకు తీసుకువచ్చే నెపంతో ఒడిసెల కుంట గ్రామం శివారులోని అటవీ ప్రదేశానికి భార్యను ద్విచక్రవాహనంపై తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక మద్యాహ్నం ఒంటిగంట సమయంలో సుచరిత కాళ్ళు, చేతులను తాడుతో కట్టేశాడు. ఆ తరువాత ఒంటిమీద కారంపొడి చల్లి.. శారీరకంగా హింసించి.. కర్రలతో కొట్టి... దారుణంగా చంపాడు.

హైదరాబాద్ : చార్మినార్‌ వద్ద రూ.500 నోట్ల వర్షం .. పట్టుకునేందుకు ఎగబడ్డ జనం , వీడియో వైరల్

ఆ తరువాత సుచరిత మరణించిందని నిర్ధారించుకున్న చంద్రశేఖర్ తాను తెచ్చుకున్న నీళ్ల సీసాలోని నీటితో.. ఆమె శరీరంపై ఉన్న రక్తం మరకలను శుభ్రం చేశాడు. ఆ తర్వాత తన బంధువులకు ఫోన్ చేసి సుచరిత కట్టెలు తీసుకు వస్తున్న క్రమంలో రాళ్లపై కిందపడింది అని తెలిపాడు. చంద్రశేఖర్ తల్లి, గ్రామీణ వైద్యులతో ఘటనాస్థలానికి వెళ్ళగా.. అప్పటికే విగతజీవిగా మారిన సుచరితను.. స్పృహ కోల్పోయిందని నమ్మబలికాడు. దీంతో ట్రాక్టర్ లో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా.. కొంత దూరం వెళ్ళాక అంబులెన్సులు వచ్చాయి. 

ట్రాక్టర్ నుంచి ఆమెను.. అంబులెన్స్ లోకి మార్చారు. ఈ క్రమంలో అక్కడి నుంచి చంద్రశేఖర్ పరారయ్యాడు. ఆస్పత్రిలో సుచరిత మరణించిందని, ఆమె ఒంటిమీద గాయాలున్నాయని.. అది సహజమరణం కాదని వైద్యులు నిర్థారించారు. దీంతో పరారీలో ఉన్న భర్త కోసం వెతకడం మొదలుపెట్టారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే బుధవారం అతడిని పట్టుకుని విచారించారు. విచారణలో నిందితుడు నేరం ఒప్పుకున్నాడని హత్యకు ఉపయోగించిన ద్విచక్ర వాహనం, తాడు, కారం పొడి ప్యాకెట్, వాటర్ బాటిల్, కర్రను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీన్ యాక్షన్ నేపథ్యంలో నిందితుడు ఎలా హత్య చేశాడో వివరించాడని తెలిపారు. చంద్రశేఖర్ ను కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ముత్యం రమేష్, ఎస్సై పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.