హైదరాబాద్ : చార్మినార్‌ వద్ద రూ.500 నోట్ల వర్షం .. పట్టుకునేందుకు ఎగబడ్డ జనం , వీడియో వైరల్

హైదరాబాద్ చార్మినార్ వద్ద ఓ వ్యక్తి రూ.500 నోట్లను గాల్లోకి విసరడం కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 
 

Man throws Rs 500 notes in air at Charminar in hyderabad

హైదరాబాద్‌లోని (hyderabad) ప్రఖ్యాత చార్మినార్ (charminar) వద్ద ఓ వ్యక్తి రూ.500 నోట్లను గాల్లోకి విసిరేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వల్ల నగరంలోని గుల్జార్ హౌజ్ రోడ్డులో కార్లు, ఇతర వాహనాలపై వెళ్తున్న వారు ఈ దృశ్యాన్ని చూసి షాకయ్యారు. సదరు వీడియోలో కుర్తా, పైజామా ధరించిన ఓ వ్యక్తి గుల్జార్ హౌస్ ఫాంటెన్ (Gulzar Houz fountain) వద్ద నిలబడి రూ.500 నోట్ల కట్టలను గాలిలోకి విసిరివేస్తున్నాడు. ఈ వీడియో అనేక సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. అయితే తన బంధువుల వివాహ వేడుకల్లో భాగంగానే సదరు వ్యక్తి రూ.500 నోట్లను గాలిలోకి విసిరినట్లుగా పలువురు భావిస్తున్నారు. 

ఈ ఘటన మూడు రోజుల క్రితం అర్థరాత్రి సమయంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో కార్లు, మోటారు సైకిళ్లపై జనాన్ని సదరు వీడియోలో చూడవచ్చు. వీరిలో ఒక వ్యక్తి కారు దిగి నోట్లను గాల్లోకి విసిరేశాడు. గుల్జార్ హౌజ్ ఫౌంటెన్ పైకి ఎక్కుతూ, దిగుతూ పలుమార్లు అతను గాల్లోకి నోట్లు విసిరాడు. దీనిని చూసిన స్థానికులు నోట్లు సేకరించేందుకు ఎగబడగా.. మరికొందరు మాత్రం ఈ దృశ్యాలను తమ ఫోన్‌లలో బంధించడంలో బిజీగా వున్నారు. 

అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆ వ్యక్తి చేసిన పనిపై మండిపడ్డారు. కొందరు ఈ వీడియో వాస్తవికతతో పాటు గాలిలోకి విసరబడ్డ నోట్లు అసలైన కరెన్సీనేనా అని అనుమానించారు. దీనిపై చార్మినార్ ఏరియా ఇన్స్‌పెక్టర్ బీ.గురునాయుడు మాట్లాడుతూ.. తాము ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసినట్లు తెలిపారు. అయితే ఈ వీడియోకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందులేదని ఆయన వెల్లడించారు. అలాగే దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఇన్స్‌పెక్టర్ చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios