మతిస్థిమితం కోల్పోయిన భర్త.. భార్య మెడకు చున్నీ బిగించి హత్య...

మతిస్థిమితం కోల్పోయిన ఓ భర్త.. భార్యకు నరకం చూపించాడు. చివరకు ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆ తరువాత రోడ్డుమీద వెడుతున్న వారిపై రాళ్లతో దాడిచేశాడు. 

husband assassinated wife over suspicion and mental illness in hyderabad

హైదరాబాద్ : హైదరాబాదులోని జియాగూడలో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ భర్త.. నమ్మి జీవితాన్ని పంచుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. భర్త మతిస్థిమితం కోల్పోయి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. కోలుకుని ఇంటికి వచ్చిన  అతను భార్యను అనుమానంతో వేధించాడు. కొంతకాలం పాటు భరించిన భార్య ఇక భరించలేక అతని నుండి దూరంగా వెళ్ళిపోయింది. అయితే, ఎక్కడైనా ఎంతకాలం ఉంటా అనుకుందో.. భర్త మారాడనుకుందో కానీ.. ఆ తర్వాత కొంత కాలానికి భర్త మీద జాలిపడి  మళ్లీ కాపురానికి వచ్చింది.  అయితే అప్పటికి అతని ప్రవర్తన మారలేదు. చివరికి ఆమెను అత్యంత కిరాతకంగా కడతేర్చాడు.  

Kulsumpura సీఐ అశోక్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ సంజయ్ నగర్ కు చెందిన ఎం. సంతోష్(32)కు పదేళ్ల క్రితం  సరిత(29)తో వివాహం అయ్యింది. వీరికి 9, 6 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంతోష్ టిఫిన్  సెంటర్లో పని చేసేవాడు. మద్యానికి బానిసయ్యాడు. ఎప్పుడూ మద్యం మత్తులో ఉంటూ కుటుంబం పట్ల బాధ్యతారాహిత్యంగా ఉండేవాడు. గతంలో మతిస్థిమితం కూడా కోల్పోయాడు. కొంతకాలం ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చికిత్స పొందాడు. ఆ తర్వాత కోలుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి అనుమానంతో భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. 

పుల్లారెడ్డి స్వీట్స్ కుటుంబానికి షాక్.. కోడల్ని ఇంట్లోకి అనుమతించాలని కోర్ట్ ఆదేశం

ఈ వేధింపులు, హింస భరించలేక ఇటీవల భార్య సరిత.. పిల్లలను తీసుకుని సన్ సిటీ లోని తన సోదరి ఇంట్లో కొంతకాలం ఉన్నది. అక్కడే తన పిల్లలను వదిలి ఈ నెల 14న ఒంటరిగా భర్త వద్దకు వచ్చింది. గురువారం దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రెండు గంటలపాటు సరిత పెద్దపెట్టున కేకలు వేసింది. ఆ తర్వాత ఉదయం ఆరుగంటల సమయంలో సంతోష్ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇంటి ముందు నుంచి వెళ్తున్న సురేష్ తో పాటు మరికొందరు మీద రాళ్లతో దాడి చేశాడు.  
దీంతో ఇరుగు పొరుగువారు కుల్సుంపురా పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సంతోష్ ఇంట్లోకి వెళ్లి చూశారు. అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యారు. సరిత పరుపుపై విగతజీవిగా పడి ఉంది. ఆమె గొంతుకు చున్నీ బిగించి  హతమార్చిన ఆనవాళ్లు కనిపించాయి.  పొత్తికడుపు కింది భాగాల్లో కత్తితో పొడిచిన గాట్లు ఉన్నాయి. ఆమెను అత్యంత క్రూరంగా హింసించి హతమార్చినట్లు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios