బంగారం విడిపించమని అడిగిన పాపానికి కట్టుకున్న భార్యను కర్కశంగా హతమార్చాడో భర్త. ప్రేమించి పెళ్లి చేసుకుని అప్పుల బాధ తాళలేక బంగారాన్ని తాకట్టుపెట్టాడు. ఎంతకీ విడిపించకపోవడంతో భార్య విడిపించాలని కోరింది.
కరీంనగర్ : కుదువ పెట్టిన gold విడిపించాలని పదేపదే అడిగిన భార్యను హతమార్చిన husband సమీపంలోని సంజయ్ గాంధీ నగర్ లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్లక్రితం karimnagar, సంజయ్ గాంధీ నగర్ కు చెందిన సుందరగిరి రాజేష్ ఎలిగేడుకు చెందిన రక్షితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. గతంలో భూపాలపల్లిలో పనిచేసిన కాలంలో రాజేష్ కు అప్పులు ఎక్కువ అయ్యాయి. ఇటీవల ఇక్కడికి వచ్చి గోదావరిఖని అడ్డగుంటపల్లిలో కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో రాజేష్ కు అప్పుడు మరింత పెరిగిపోయాయి.
అప్పులు తీర్చడానికి కొంతకాలం క్రితం తన భార్య రక్షిత(25) అలియాస్ కల్పన వద్ద ఉన్న 5తులాల బంగారాన్ని కుదువపెట్టి డబ్బు తెచ్చుకున్నాడు. పుట్టింట్లో శుభకార్యం ఉండడంతో ఇటీవల బంగారం విడిపించి తేవాలని రక్షిత పదేపదే కోరింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలు ఇంట్లో ఉన్న స్క్రూ డ్రైవర్ తో రక్షితను గొంతులో పొడిచి హతమార్చాడు రాజేష్. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. ఇంటి చుట్టు పక్కల వాళ్ళు సమీప కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చి పరిశీలించగా హత్యోదంతం బయటకు వచ్చింది. రక్షిత కు రెండేళ్ల కుమారుడు ఉండగా నిందితుడు రాజేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఏసిపి గిరి ప్రసాద్, రామగుండం సిఐ శ్రీ లక్ష్మీనారాయణ, ఎస్సైలు స్వరూప్ రాజ్, కుమార్, శరణ్య, లక్ష్మీ ప్రసన్న పరిశీలించారు. మృతురాలి తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9న నిజామాబాద్ లో ఓ దారుణ ఘటన జరిగింది. తన కుమారుడి deathకి మరదలే కారణమని రగిలిపోయిన ఆ మహిళ.. ఆమె కుమారుడిని హతమార్చి Revenge తీర్చుకున్న వైనమిది. nizamabadలో శుక్రవారం సిపి నాగరాజు ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్ లోని ఆటో నగర్కు చెందిన రుక్సానా బేగం, అస్లాం ఖాన్ కుమారుడు ఫైజల్ ఖాన్ 9 ఏళ్ల క్రితం గుంతలో పడి మరణించాడు. అప్పటికి ఆ బాలుడి వయసు మూడేళ్లు. కుమారుడి మృతికి తన భర్త చెల్లెలు సనా బేగమే కారణమని రుక్సానా అనుమానం పెంచుకుంది.
ఈ క్రమంలో మార్చి 31న ఇంటిదగ్గర ఆడుకుంటున్న సనా బేగం కుమారుడు ఫయాజ్(7)ను ఆటోలో బోధన్ కు తీసుకువెళ్లి అక్కడ ఒకరి ఇంట్లో ఉంచి.. తిరిగి ఆటోనగర్ కు చేరుకుంది. అప్పటికే బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెతుకుతుండగా.. తాను వెతుకుతున్నట్లు వారిని నమ్మించింది. అదే రోజు రాత్రి మళ్ళీ బోధన్కు వెళ్ళిన రుక్సానా బేగం ఆ బాలుడిని హతమార్చింది. తరువాత నిజాం సాగర్ కొత్త కెనాల్ నీటిలో పడేసింది.
బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా లోతుగా విచారించిన పోలీసులు బాలుడిని హత్య చేసింది.. తన మేనత్త రుక్సానా బేగం, మరో బాలిక అని తేల్చారు. వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
