కాపురం చేయడం ఇష్టం లేదన్న భార్య.. పంచాయతీ పెద్దల సమక్షంలోనే రాయితో మోది హత్య చేసిన భర్త...
శనివారం గ్రామంలోని పెద్దల సమక్షంలో ఈ విషయం మీద పంచాయతీ పెట్టాడు. అయితే పంచాయితీలో పెద్దల ముందు రేణుక తన భర్తతో కాపురం చేయనని తెగేసి చెప్పి.. వెళ్ళిపోతుండగా తలపై పెద్ద రాయితో నాలుగు సార్లు కొట్టడంతో.. రేణుక అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
కరీంనగర్ : మంథనిలోని ఉప్పట్ల గ్రామంలో కాసిపేట రేణుకను murder చేసిన కేసులో ఆమె భర్త కాసిపేట బానయ్యను arrest చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ సతీష్ తెలిపారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించి నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించారు. బానయ్యకు ఇద్దరు భార్యలని.. గ్రామానికి చెందిన రేణుకను 16 ఏళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడని సీఐ తెలిపారు.
వీరి మధ్య చాలా ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయని.. దీంతో రేణుక జూలైలో ఇంటినుంచి వెళ్ళిపోగా స్థానిక పోలీస్ స్టేషన్లో missing case నమోదైందన్నారు. ఈ క్రమంలో రేణుకను వెతికి తీసుకురాగా భర్తతో ఉంటానని చెప్పి భర్తతో వెళ్లిందన్నారు. అయితే కొంతకాలం తర్వాత భార్య మళ్లీ ఇల్లు వదిలి hyderabad కు వెళ్లిపోయింది. అక్కడ ఓ హోటల్లో పని చేస్తున్న విషయం తెలుసుకున్న భర్త బానయ్య.. వారం క్రితం వెళ్ళి ఆమెను తీసుకువచ్చాడు.
శనివారం గ్రామంలోని పెద్దల సమక్షంలో ఈ విషయం మీద పంచాయతీ పెట్టాడు. అయితే పంచాయితీలో పెద్దల ముందు రేణుక తన భర్తతో కాపురం చేయనని తెగేసి చెప్పి.. వెళ్ళిపోతుండగా తలపై పెద్ద రాయితో నాలుగు సార్లు కొట్టడంతో.. రేణుక అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన రాయితో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చంద్ర శేఖర్ తెలిపారు.
హైదరాబాద్: పెళ్లింటికి బ్యాంక్ రికవరీ సిబ్బంది... అవమానంతో పెళ్లికొడుకు ఆత్మహత్య
ఇదిలా ఉండగా, కర్ణాటకలోని బెంగళూరులో ఇలాంటి హత్యోదాంతమే వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి ప్రియురాలిని కలవడానికి ఇంటికి వచ్చిన ప్రియున్ని ఆమె తండ్రి కోపంతో murder చేశాడు. ఈ ఘటన గత 28వ తేదీ రాత్రి జరగ్గా, ఆదివారం నిందితున్ని arrest చేశారు. వివరాల్లోకి వెడితే..
బెంగళూరులో వినోబానగర ఆటోడ్రైవర్ నారాయణ్ కు ఓ daughter ఉంది. ఆమె ఇటీవల ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతను తమిళనాడుకు చెందిన నివేశ్ కుమార్. ఆ యువకుడు రెండు నెలల క్రితం ఇదే ప్రాంతానికి వచ్చి పెదనాన్న ఇంట్లో ఉంటున్నాడు. నారాయణ్ కూతురితో నివేశ్ ప్రేమాయణం ప్రారంభించాడు.
వారిద్దరూ ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో తరచుగా కలుసుకునేవారు. ఇది పెద్దలకు తెలియదు. అలాగే ఆ రోజు కూడా యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో నివేశ్ వెళ్లాడు. ఇంతలో యువతి తండ్రి నారాయణ్ వచ్చాడు. ఇంట్లో ఇద్దరినీ ఏకాంతంగా చూసి పట్టలేని కోపంతో ఊగిపోయాడు.
Disha Encounter Case : దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ కి రెండేళ్లు పూర్తి....
పక్కనే ఉన్న stickతో నివేశ్ తలమీద గట్టిగా కొట్టడంతో యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చూస్తే అప్పటికే చనిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక, నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. dead body ని వేకువజామున ఆటోలో తీసుకెళ్లి విక్టోరియా ఆస్పత్రి వద్ద పెట్టి అక్కడ నుంచి ఉడాయించాడు. పోలీసులు దర్యాప్తు చేసి ప్రియుని తండ్రి హత్య చేశాడని గుర్తించి అరెస్ట్ చేశారు.