కామారెడ్డి జిల్లాలో విషాదం: నాటు తుపాకీ పేలి రావోజీ అనే వ్యక్తి మృతి
కామారెడ్డి జిల్లాలో నాటు తుపాకీ పేలి బుధవారంనాడు ఒకరు మృతి చెందారు. సిరికొండ అటవీ ప్రాంతంలో వేట నుండి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలింది. ఈ ఘటనలో రావోజీ మృతి చెందారు.
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో నాటు తుపాకీ పేలి బుధవారం నాడు ఒకరు మృతి చెందారు. జిల్లాలోని సిరికొండ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు అటవీ ప్రాంతంలోకి వేటకు వెళ్లారు. వేట నుండి తిరిగి వచ్చే సమయంలో నాటు తుపాకీ పేలింది.ఈ ఘటనలో రావోజి అనే వ్యక్తి మృతి చెందారు. మాచారెడ్డి మండలం సోమరిపేటవాసిగా గుర్తించారు.
సిరికొండ అటవీ ప్రాంతానికి రాంరెడ్డి, అసిరెడ్డితో కలిసి రావోజీ వేటకు వెళ్లారు. వేట నుండి తిరిగి వస్తున్న సమయంలో నాటు తుపాకీ పేలింది. దీంతో రావోజీ మృతి చెందాడు. నాటు తుపాకీ పేలడంతో రాంరెడ్డి, ఆసిరెడ్డిలు భయంతో పారిపోయారు. తుపాకీ శబ్దం వినడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రావోజీ మృతిపై పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ గటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.