Asianet News TeluguAsianet News Telugu

వర్షాలకు నీటిలో కొట్టుకొచ్చిన పూడ్చిన మృతదేహం.. రెండుసార్లు అంత్యక్రియలు... !

దీంతో ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని చలివాగు ఒడ్డుకు తీసుకెళ్లి పూడ్చి అంతిమ సంస్కారాలు చేశారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చలివాగు ఉప్పొంగడంతో పూడ్చిన శవం నీటిలో తేలియాడుతూ మండలంలోని వెలిశాల శివారులో గల చెట్ల కొమ్మలకు చిక్కుకోవడంతో.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

human corpse open cremation land water tekumatla, warangal
Author
Hyderabad, First Published Sep 1, 2021, 11:28 AM IST

వరంగల్ : ఒకే మృతదేహానికి రెండుసార్లు అంతిమ వీడ్కోలు పలికిన హృదయ విదారక సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని అంకుషాపూర్ లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. అంకుషాపూర్ గ్రామానికి చెందిన గురుకుంట్ల భద్రమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది.
 
దీంతో ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని చలివాగు ఒడ్డుకు తీసుకెళ్లి పూడ్చి అంతిమ సంస్కారాలు చేశారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చలివాగు ఉప్పొంగడంతో పూడ్చిన శవం నటిలో తేలియాడుతూ మండలంలోని వెలిశాల శివారులో గల చెట్ల కొమ్మలకు చిక్కుకోవడంతో.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని బైటికి తీసి అంకుషాపూర్ గ్రామానికి చెందిన గురుకుంట్ల భద్రమ్మగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడే దహన సంస్కారాలు నిర్వహించినట్లు ఎస్సై రమణారెడ్డి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios