Asianet News TeluguAsianet News Telugu

న్యూ ఇయర్ జోష్.. తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు.. నిన్న ఒక్కరోజే ఎంత ఆదాయం వచ్చిందంటే..

న్యూ ఇయర్ వేళ తెలంగాణలో మద్యం ఏరులై పారింది.  డిసెంబర్ 31న భారీగా మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. 

Huge Liquor sales record level on 31st december in telangana
Author
First Published Jan 1, 2023, 2:51 PM IST

న్యూ ఇయర్ వేళ తెలంగాణలో మద్యం ఏరులై పారింది. మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. డిసెంబర్ 31న తెలంగాణ భారీగా  మద్యం అమ్మకాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణలోనూ 215.74 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు కొంత తగ్గినప్పటికీ.. ధరలు పెరగడంతో భారీగా ఆదాయం సమకూరించింది. ఒక్క హైదరాబాద్‌లోనే రూ. 37 కోట్ల మేకు మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31 అర్దరాత్రి వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం ద్వారా అమ్మకాలు మరింతగా పెరిగి.. భారీగా ఆదాయం రావడానికి కారణంగా కనిపిస్తుంది. 

ఇక, తెలంగాణలోని 19 మద్యం డిపోల నుంచి జరిగిన రిటైల్ అమ్మకాల వివరాలను పరిశీలిస్తే.. సుమారుగా 2,17,444 లిక్కర్ కేసులు, 1,28,455 బీర్ కేసులు అమ్ముడయ్యాయి. మరోవైపు న్యూ ఇయర్ మొదటి రోజు(జనవరి 1) ఆదివారం రావడంతో.. ఇవాళ కూడా మద్యం అమ్మకాలు భారీగానే ఉండే అవకాశం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా  న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. చాలా చోట్ల న్యూ ఇయర్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక, న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ నిర్వహించారు. న్యూ ఇయర్ వేళ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 5,819 వాహనదారుల లైసెన్సులు రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios