హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఇన్వెస్ట్‌మెంట్ స్కాం.. దేశవ్యాప్తంగా రూ.600 కోట్లు వసూలు
హైదరాబాద్‌లో భారీ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. సదరు కంపెనీ దేశవ్యాప్తంగా రూ.600 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్‌లో భారీ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. సదరు కంపెనీ దేశవ్యాప్తంగా రూ.600 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో 12 మందిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు చైనా దేశస్తులు వున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన వారిలో ఐదుగురు ఢిల్లీవాసులు, ముగ్గురు హైదరాబాదీలు వున్నట్లుగా సమాచారం. 12 మందిని రిమాండ్‌కు తరలించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.