Asianet News TeluguAsianet News Telugu

మీ వెహికిల్ పెండింగ్ చలాన్ చెల్లించాలా..? ఇలా సింపుల్ గా చేసేయండి... 

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులు భారీ రాయితీపై పెండింగ్ చలాన్లు చెల్లించే ఆఫర్ ను ప్రకటించింది. ఈ చలాన్లను కూర్చున్నచోటే ఎలా చెల్లించవచ్చో తెలుసుకొండి. 

How to pay pending traffic challans in online at Telangana? AKP
Author
First Published Dec 27, 2023, 1:40 PM IST

హైదరాబాద్ : మీరు తెలంగాణలో నివాసం వుంటున్నారా? మీ వద్ద ఏదయినా వాహనం వుండి దానిపై ట్రాఫిక్ ఉళ్లంఘన చలాన్లు పెండింగ్ లో వున్నాయా? అయితే వెంటనే చెల్లించండి. తెలంగాణ ప్రభుత్వం వాహనాలపై వున్న పెండింగ్ చలాన్లను నిర్ణీత కాలవ్యవధిలో చెల్లిస్తే భారీ డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. టూ, త్రీ వీలర్లపై 80 శాతం, ఫోర్ వీలర్, హెవీ వెహికిల్స్ పై 50 నుండి 60 శాతం రాయితీ ప్రకటించింది. ఈ అవకాశం కేవలం ఈ డిసెంబర్ 26 నుండి జనవరి 10 వరకు వాహనాల పెండిగ్ చలాన్లు చెల్లించేవారికే ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.  

అయితే మీ వాహనాలు పెండింగ్ చలాన్లను వివిధ మార్గాల్లో చాలా సింపుల్ గా చెల్లించవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.  

పేటిఎం యాప్ నుండి చలాన్ల చెల్లింపు : 

1. మీ స్మార్ట్ ఫోన్ లో పేటిఎం యాప్ వుంటే ఓపెన్ చేసి మీ వివరాలతో లాగిన్ అవ్వండి. 

2. బిల్ పేమెంట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.  దీంట్లో ట్రాఫిక్ సిగ్నల్ సింబల్ తో చలాన్స్ అనే మరో ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి.

3. వివిధ రాష్ట్రాలకు చెందిన ట్రాఫిక్ పోలీస్ ఆఫ్షన్లు వస్తాయి. ఇందులో తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ ను ఎంచుకొండి. 

4. ఆ తర్వాత ఏ వెహికిల్ చలాన్లు చెల్లించాలని అనుకుంటున్నారో దాని నెంబర్ ఎంటర్ చేయాలి. దీంతో ఆ వాహనంపై ఎన్ని పెండింగ్ చలాన్లు వున్నాయో కనిపిస్తుంది. వాటిని పేటిఎం వ్యాలెట్ తో పాటు డెబిట్, క్రెడిట్, యూపిఐ, నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించి చెల్లించవచ్చు. 


తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్ నుండి చలాన్లు ఎలా చెల్లించాలంటే : 

1. ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్, ల్యాప్ టాప్ లో గూగుల్ ఓపెన్ చేసి TS e-challas  అని టైప్ చేసి ఓకే చేయగానే తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టమ్ పేరుతో ఓ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. 

2. ఇందులో ఏ వాహనం చలాన్ చెల్లించాలని అనుకుంటున్నామో ఆ వెహికిల్ నంబర్, అడిగే  ఓ చిన్న ప్రశ్నకు సమాధానం ఎంటర్ చేసి GO అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

3. వెంటనే ఆ వాహనంపై ఎన్ని చలాన్లు వున్నాయో ఇమేజ్ తో సహా వస్తుంది. ఈ చలాన్లు మొత్తం చెల్లించాలంటే సీరియల్ నెంబర్స్ పైన సెలెక్ట్ ఆల్ బాక్స్ లో క్లిక్ చేయండి. లేదంటే ఏ చలాన్ చెల్లించాలని అనుకుంటున్నామో ఆ సీరియల్ నంబర్ పక్కన బాక్స్ వుంటుంది దానిపై క్లిక్ చేయండి. కింద ఏపిటి ఆన్లైన్, మీసేవ, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ వుంటాయి. ఇందులో నెట్ బ్యాంకింగ్  క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్లు వస్తాయి. వాటిలో మనం ఎలా చెల్లించాలని అనుకుంటున్నామో దానిపై  క్లిక్ చేయాలి.

4. ఆ తర్వాత ఈ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తో పాటు ప్రశ్న వస్తుంది. వాటిని ఫిల్ చేసి ముందుకు వెళితే ట్రాన్సాషన్ రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దాన్నినోట్ చేసుకుని ఓకే కొట్టగానే క్రెడిట్, డెబిట్ కార్డుతో పాటు నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ వస్తుంది. దాంట్లో దేన్నుంచి అయితే చలాన్లు చెల్లించాలని అనుకుంటున్నారో ఆ బ్యాంక్ ను ఎంచుకోవాలి.  ఆ తర్వాత అమౌంట్ డీటెయిల్స్ వస్తాయి. దాని కిందనే కన్ఫర్మ్ ఆప్షన్ వుంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.  

5. ఆ తర్వాత యూజన్ ఐడీ లేదంటే రిజిస్టర్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మన ఫోన్ కు ఓటిపి వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే డెబిట్ లేదా క్రెడిట్ లేదంటే యూపిఐ పిన్ అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి ప్రోసీడ్ కాగానే పేమెంట్స్ డిటెయిల్స్ వస్తాయి. వాటిని సరిచూసుకుని ఓకే చేయగానే పేమెంట్ సక్సెస్ అనే మెసేజ్ వస్తుంది. 

ఆన్లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లోనూ మీ వాహనాల చలాన్లను చెల్లించవచ్చు. ఇందుకోసం మీరు మీసేవ కేంద్రానికి వెళ్లాల్సి వుంటుంది. అక్కడ మీ వాహనం డిటెయిల్స్, పెండింగ్ చలాన్ డబ్బులతో పాటు సర్వీస్ చార్జెస్ చెల్లించి చలాన్లు చెల్లించవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios