హైదరాబాద్: ఐపీఎస్ అధికారిని అంటూ ప్రియుడు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్ పర్సన్ ను అంటూ ప్రేయసి ఓ వ్యాపారికి రూ.11.5 కోట్లు టోకరా వేశారు. ప్రియుడు విజయ్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకోగా,  ప్రేయసి శిరీష అలియాస్ శృతి సిన్హా వీరారెడ్డి అనే వ్యాపారి వద్ద రూ.11.5 కోట్లు వసూలు చేశారు. 

విలాసవంతమైన జీవితాలు గడుపుతూ వారు ఆ మొత్తాన్ని వివిధ పద్ధతుల్లో ఖర్చు చేశారు. వీరారెడ్డిని చాలా తెలివిగా విజయ్ కుమార్ రెడ్డి టోకరా కొట్టించాడు. తమ అమ్మకు బాగాలేదని, వైద్యం చేయించాలని, అవసరానికి తన బ్యాంక్ ఖాతా ఫ్రీజైందని, కార్డులు కూడా పనిచేయడం లేదని విజయ్ కుమార్ రెడ్డి వీరారెడడికి చెప్పాడు. 

ఆలా చెప్పి విజయ్ కుమార్ రెడ్డి మొదట వీరారెడ్డి నుంచి రూ.3.5 లక్షలు తీసుకున్నాడు. తనకున్న 72 ట్రావెల్స్ బస్సుల ధ్రువీకరణ పత్రాలను రెన్యూవల్ చేయించాలని చెప్పి రూ.10 లక్షలు తీసుకున్నాడు. తనకు మానవ హక్కులకు సంబంధించిన సదస్సులు, సమావేశాలు ఉన్నాయని, అందుకు డబ్బులు కావాలని, కార్యక్రమాలు పూర్తయిన వెంటనే తిరిగి ఇచ్చేస్తానని వీరారెడ్డికి చెప్పి టోపీ వేసింది. 

Also Read: హోటళ్లకే రూ. 40 లక్షలు అద్దె: మాయలేడిపై దిమ్మతిరిగే విషయాలు వెల్లడి

ఆ డబ్బుతో విజయ్ కుమార్ రెడ్డి అధునాతనమైన కార్లు కొన్నాడు. ఇరువురు విలాసవంతమైన హోటల్లో దిగి రూ.40 లక్షలు చెల్లించారు. రోజువారీ ఖర్చులు సరేసరి. అవి కూడా అదే మొత్తంలో అ్యయాయి. 

అంతేకాకుండా బంధువుల వద్ద తమ ఉదారతను చాటుకున్నారు. ఎవరికైనా అవసరం వస్తే డబ్బులు ఇస్తూ వెళ్లారు. చిన్న మొత్తాలను తిరిగి అడిగేవారు కూడా కాదు. ఒకరికి రూ.40 లక్షలు ఇచ్చారని, అతను దాంతో పొలం కొన్నాడని పోలీసులు గుర్తించారు. దాంతో విజయ్ కుమార్ రెడ్డి, శిరీషల మీద గౌరవం పెరిగింది. విజయ్ కుమార్ రెడ్డిని తండ్రి రాఘవరెడ్డి, ఇతర బంధువులు అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. 

జరిగిన విషయం విజయ్ కుామర్ రెడ్డి వారికి చెప్పాడు. దాంతో వారు కూడా అతనితో కలిశారు. సీఐఎన్ఎఫ్ లో డీసీపీ ర్యాంక్ అధికారిగా పనిచేస్తున్నాడంటూ రాఘవరెడ్డిని వీరారెడ్డికి పరిచయం చేశారు నిజానికి అనతు సీఐఎస్ఎఫ్ లో ఎఎస్ఐ.  టెండర్లు ఇప్పిస్తామని, వ్యాపారంలో ఆటంకాలు లేకుండా చేస్తాని రాఘవరెడ్డి, ఇతర బంధువులు వీరారెడ్డిని నమ్మించారు. 

అయితే, కథ అడ్డం తిరిగింది. కడపకు చెందిన శిరీష్ అలియాస్ స్మృతి సిన్హా, విజయ్ కుమార్ రెడ్డి వీరారెడ్డి అనే వ్యాపారిని నమ్మించి రూ.11.5 కోట్లు వసూలు చేశారు. అయితే, ఆ మొత్తాన్ని వారు తిరిగి చెల్లించకపోవడంతో వీరారెడ్డికి అనుమానం వచ్చింది.  దాంతో వీరారెడ్డి విజయ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావని అడిగితే డెహ్రడూన్ లోని పోలీసు అకాడమీలో ఉన్నానని చెప్పాడు. దాంతో వాట్సప్ లైవ్ లోకేషన్ పంపించాలని వీరారెడ్డి అడిగాడు. దాంతో మిమ్మలను మోసం చేశాను, శిరీష్ నన్ను తప్పుదోవ పట్టించింది, ఐ యామ్ సారీ అంటూ వాయిస్ రికార్డును వీరారెడ్డికి పంపించి ఈ నెల 5వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. 

దాంతో ఈ నెల 12వ తేదీన వీరారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో బాచుపల్లి పోలీసులు మాయలేడీ శిరీషతో పాటు ఆమెకు సహకరించిన విజయ్ కుమార్ రెడ్డి బంధువులు నలుగురిని బుధవారం అరెస్టు చేశారు.