Asianet News TeluguAsianet News Telugu

హోటళ్లకే రూ. 40 లక్షలు అద్దె: మాయలేడిపై దిమ్మతిరిగే విషయాలు వెల్లడి

వీరారెడ్డి అనే వ్యాపారికి కోట్లకు మోసం చేసిన మాయలేడి శిరీష్ అలియాస్ శ్రుతి సిన్హా విషయంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ప్రియుడు విజయ్ కుామర్ రెడ్డితో కలిసి ఆమె మోసానికి పాల్పడింది.

More details revealed in Sirisha and Vijaykumar Reddy cheating case
Author
Hyderabad, First Published Feb 26, 2021, 7:15 AM IST

హైదరాబాద్: తెలంగాణలోని హైదారబాదు సమీపంలో గల బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారికి రూ.11.5 కోట్లు టోకరా వేసిన మాయలేడి గురించి విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఐపీఎస్ అధికారిగా ప్రియుడు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్ పర్సన్ గా ప్రేయసి పరిచియం చేసుకుని ఆ మోసానికి పాల్పడ్డారు. వారి విషయంలో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

విలాసవంతమైన హోటల్లో రోజుకు రూ.50 వేలు అద్దె చెల్లిస్తూ రోజుకు రూ. 50 వేలు ఖర్చు చేస్తూ వారిద్దరు ఇతరులకు టోకరా వేసే పనికి పూనుకున్నారు. అలా 40 రోజుల పాటు వారు విలాసవంతమైన జీవితాలు గడిపారు. కడపకు చెందిన శిరీష్ అలియాస్ స్మృతి సిన్హా, విజయ్ కుమార్ రెడ్డి వీరారెడ్డి అనే వ్యాపారిని నమ్మించి రూ.11.5 కోట్లు వసూలు చేశారు. అయితే, ఆ మొత్తాన్ని వారు తిరిగి చెల్లించకపోవడంతో వీరారెడ్డికి అనుమానం వచ్చింది. 

అనుమానం వచ్చి వీరారెడ్డి విజయ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావని అడిగితే డెహ్రడూన్ లోని పోలీసు అకాడమీలో ఉన్నానని చెప్పాడు. దాంతో వాట్సప్ లైవ్ లోకేషన్ పంపించాలని వీరారెడ్డి అడిగాడు. దాంతో మిమ్మలను మోసం చేశాను, శిరీష్ నన్ను తప్పుదోవ పట్టించింది, ఐ యామ్ సారీ అంటూ వాయిస్ రికార్డును వీరారెడ్డికి పంపించి ఈ నెల 5వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. 

దాంతో ఈ నెల 12వ తేదీన వీరారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో బాచుపల్లి పోలీసులు మాయలేడీ శిరీషతో పాటు ఆమెకు సహకరించిన విజయ్ కుమార్ రెడ్డి బంధువులు నలుగురిని బుధవారం అరెస్టు చేశారు. వీరారెడ్డి నుంచి వసూలు చేసిన డబ్బులు ఎక్కువ మొత్తాన్ని విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు వాడుకున్నారు. 

విజయ్ కుమార్ రెడ్డికి కార్లంటే మహా ఇష్టం. రూ.1.8 కోట్లతో బిఎండబ్ల్యూ కారు కొన్నాడు. ఆ ఫొటోలను వీరారెడ్డికి పంపించాడు. దాంతో ఆయన వాళ్లను పూర్తిగా విశ్వసించాడు. ఆ తర్వాత 1.7 కోట్లు పెట్టి మరో కారు, రూ.70 లక్షలతో ఇంకో కారు కొన్నాడు. ప్రేయసికి పుట్టిన రోజు కానుకగా రూ.50 లక్షల బంగారం ఆభరణాలను ఇచ్చాడు. శంషాబాదులోని ఓ విలాసవంతమైన హోటల్లో రూ.40 లక్షలు పెట్టి 40 రోజులు ఉన్నారు. విశాఖపట్నంలో ఎనిమిది రోజులు ఉన్నారు. రూ.1.5 కోట్లతో పటాన్ చెరువో విల్లాను కొనుగోలు చేయడానికి రూ.70 లక్షలు చెల్లించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios