Asianet News TeluguAsianet News Telugu

ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడు పీ.వీ. నరసింహారావు: 1991 లో ఏం జరిగిందంటే?

మాజీ ప్రధాన మంత్రి పీ.వీ. నరసింహారావుకు  కేంద్ర ప్రభుత్వం  భారత రత్నను ప్రకటించింది. దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉన్న సమయంలో  ఆర్ధిక సంస్కరణలకు  పీ.వీ. నరసింహరావు శ్రీకారం చుట్టారు.

How P.V. Narasimha Rao rescued India in 1991 and made history lns
Author
First Published Feb 9, 2024, 2:03 PM IST

న్యూఢిల్లీ:  భారత దేశంలో ఆర్ధిక సంస్కరణలకు  మాజీ ప్రధాన మంత్రి పీ.వీ. నరసింహారావు ఆద్యుడిగా  పేరుంది.  1991లో నూతన ఆర్ధిక విధానాలకు  పీ.వీ. నరసింహారావు సర్కార్  అనుమతిని ఇచ్చింది.ఆ సమయంలో  నూతన ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా అప్పట్లో వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.నూతన ఆర్ధిక విధానాలు అమలు చేస్తే దేశానికి ప్రమాదం జరుగుతుందని  ఆందోళన చేశాయి లెఫ్ట్ పార్టీలు.

1991 జూలై  24న పీ.వీ. నరసింహారావు  సర్కార్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. పీ.వీ. నరసింహారావు మంత్రివర్గంలో  మన్మోహాన్ సింగ్ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగా  పనిచేశారు. 1991లో  భారతదేశంలో అత్యంత దారుణమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంది.  1990-91లో గల్ఫ్ యుద్ధంతో ఇంధనం ధరలు గణనీయంగా పెరిగాయి.అంతేకాదు  భారతదేశంలో ఫారెక్స్ నిల్వలలు క్షీణించాయి.  6 బిలియన్ల కంటే తక్కువగా ఉన్నాయి. 

ఆర్ధిక లోటు, విదేశీ రుణాలు పెరిగాయి.  స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో  8 శాతం ఆర్ధిక లోటు, జీడీపీలో  2.5 శాతం కరెంట్ ఖాతా లోటు ప్రభుత్వ కష్టాలను మరింత పెంచింది.  రెండంకెలకు ద్రవ్యోల్బణం పెరగడంతో  సామాన్యులపై భారం మరింత పడింది. ఈ క్రమంలో  పీ.వీ. నరసింహారావు సర్కార్  ఆర్ధిక సంస్కరణలు తెచ్చింది.  విదేశాల నుండి నిధులను సమకూర్చుకుంది.

also read:మాజీ ప్రధానులు పీ.వీ. నరసింహారావు, చరణ్ సింగ్ సహా స్వామినాథన్ లకు భారతరత్న

 ఎగుమతులను పెంచే ప్రయత్నాల్లో భాగంగా భారత ప్రభుత్వం లైసెన్సింగ్ ప్రక్రియలో మార్పు తీసుకురావడానికి కొత్త వాణిజ్య విధానాన్ని కూడ ప్రకటించింది. మరో వైపు కొత్త పారిశ్రామిక విధానాన్ని కూడ   అమల్లోకి తెచ్చింది.పీ.వీ. నరసింహారావు సర్కార్  ఆ తర్వాత కూడ  సంస్కరణలు కొనసాగించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios